English | Telugu

‘నీ......’, ‘డుర్‌ర్‌ర్‌ర్‌...’ ఏమిటిది లక్ష్మీ?!

మంచు లక్ష్మీ వార్తల్లోకి వచ్చిందంటే అందరూ ఎంతో ఇంట్రెస్ట్‌గా చూస్తారు. మంచు లక్ష్మీ అలా ఎందుకు ప్రవర్తించింది అనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా నెటిజన్లు ఈ విషయంలో చాలా ఫాస్ట్‌గా రియాక్ట్‌ అవుతారు. ఆమెను ట్రోల్‌ చేయడానికి, కామెంట్‌ చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. అయితే ఇలాంటి ట్రోలింగ్‌లను పట్టించుకోని లక్ష్మీ తన పని తను చేసుకుంటూ పోతుంది.
ఇదే క్రమంలో ఇప్పుడు మంచు లక్ష్మీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఇటీవల దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డుల ఫంక్షన్‌లో మంచు లక్ష్మీ పాల్గొంది.ఫంక్షన్‌ ప్రారంభానికి ముందు ఒక టివి ఛానల్‌తో చిట్‌ చాట్‌లో ఉండగా కెమెరాకుఒక వ్యక్తి అడ్డుగా వచ్చాడు. దాంతో సీరియస్‌ అయిన ఆమె అతని వీపు మీద చరిచింది. ఆ తర్వాత మరో వ్యక్తి అడ్డు వచ్చాడు. అతను దెబ్బల నుంచి తప్పించుకున్నాడు. ‘డ్యూడ్‌ కెమెరాకు అడ్డు రాకుండా ఉండడం అనేది బేసిక్‌’ అంటూ ‘నీ.......’ అనే అన్‌ పార్లమెంటరీ వర్డ్‌ను కూడా వాడిరది. అలాగే ‘డుర్‌ర్‌ర్‌...’ అంటూ కెమెరాకి అడ్డు వచ్చినవారిని మందలించింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు లక్ష్మీని టార్గెట్‌ చేస్తూ ‘ఏమిటిది లక్ష్మీ?’ అంటూ ట్రోలింగ్‌ చేస్తున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .