English | Telugu

మైనే ప్యార్ కియా డిఫరెంట్ పబ్లిసిటీ


యూనిఫై క్రియేషన్స్ పతాకంపై, ప్రదీప్ మాడుగుల దర్శకత్వంలో రూపొందిన మైనే ప్యార్ కియా చిత్రం జూన్ 20న విడుదలైంది. ఈ చిత్ర ప్రమోషన్ డిఫరెంట్ తరహాలో నిర్వహించారు ఈ చిత్రయూనిట్. విడుదల రోజున యూనిట్ అంతా కలిసి హైదారాబాదులో ఆటో రైడ్ నిర్వహించింది. ఈ ర్యాలీలో హీరో ప్రదీప్, హీరోయిన్ ఇషాతో పాటు మొత్తం యూనిట్ పాల్గొంది.ఈ సందర్భంగా మాట్లాడిన నిర్మాత సానా వెంకటరావు మాట్లాడుతూ, సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయన్నారు. ఆశింనట్టుగానే ప్రేక్షకులు తమ సినిమాని అభిమానించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.