English | Telugu

స్టైలిష్ స్టార్ మాలీవుడ్ ఎంట్రీ


అల్లు అర్జున్ మల్లూస్ రాష్ట్రం కేరళలో చాలా పాపులర్. అక్కడి సూపర్‌స్టార్‌లతో సమానంగా అల్లు అర్జున్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. తెలుగులో వచ్చిన బన్నీ ప్రతీ చిత్రం మలయాళంలోనూ విడుదలవుతుంది. ఈ చిత్ర విడుదలకు బన్నీ అభిమానులు తెగ హడావిడి కూడా చేస్తుంటారు. వీరి అభిమానం చూసిన బన్నీ స్ట్రెయిట్ మల్లు సినిమాలో నటిస్తానని మాట కూడా ఇచ్చాడు. బన్నీ కూడా ఆసక్తి కనబరచడంతో అక్కడి దర్శకులు కథలతో వచ్చి కలవడం, మలయాళ చిత్రానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా జరుగుతుందని సమాచారం. బన్నీ వద్దకు వచ్చిన కథలలో ఒకటి ఓకే చేసే అవకాశం కూడా వుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయాలు ప్రకటిస్తారంటున్నాయి సినీవర్గాలు. తెలుగులో అల్లు అర్జున్ మల్లుగా మలయాళ తెర మీద కనిపించే సమయం త్వరలోనే రానుందన్నమాట.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.