English | Telugu

మ‌హేష్ వెన‌క‌డుగు వేసేశాడు!

బాహుబ‌లి ఎఫెక్ట్ శ్రీ‌మంతుడుపైనా ప‌డింది. బాహుబ‌లి జులై 10న ఫిక్స‌య్యింది.. దాంతో పెద్ద సినిమాలు కూడా బాహుబ‌లి ద‌రిదాపుల్లో విడుద‌ల అవ్వ‌డానికి జంకుతున్నాయి. ఈ లిస్టులో శ్రీ‌మంతుడు కూడా చేరిపోయింది. జులై 17న శ్రీ‌మంతుడు సినిమాని రిలీజ్ చేస్తామ‌ని మ‌హేష్ ట్వీట్ చేయ‌డంతో.... అటు మ‌హేష్ ఫ్యాన్స్‌లోనూ ఇటు బ‌య్య‌ర్ల‌లోనూ టెన్ష‌న్‌పెరిగింది.

బాహుబ‌లి విడుద‌లైన వారానికే శ్రీమంతుడు వ‌స్తే దెబ్బ‌యిపోతుంద‌ని భ‌య‌ప‌డ్డారు. దాంతో మ‌హేష్‌ని విడుద‌ల తేదీ మార్చాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. అవ‌న్నీ ఫ‌లించాయిప్పుడు. శ్రీ‌మంతుడు వెన‌క‌డుగు వేశాడు. ఈ సినిమాని ఆగ‌స్టు 7న విడుద‌ల చేయాల‌ని తాజాగా చిత్ర‌బృందం నిర్ణ‌యించుకొంది. జులై 18న పాట‌ల్ని విడుద‌ల చేస్తారు. ఈ విష‌యాన్ని చిత్ర‌బృందం కూడా ధృవీక‌రించింది. బాక్సాపీసు ద‌గ్గ‌ర మ‌హేష్ - ప్ర‌భాస్ల పోటీ చూడాల‌నుకొన్న‌వాళ్లు మాత్రం ఈ విడుద‌ల తేదీ మార్పుతో కాస్త నిరుత్సాహ ప‌డి ఉంటారేమో..?