English | Telugu
మహేష్, నాగచైతన్య ఒకే సినిమాలో...
Updated : Jan 7, 2015
మహేష్, నాగచైతన్య ఓకే సినిమాలో అంటే మల్టీ స్టార్ట్ సినిమా కాంబినేషన్ కాదు. ఓ సినిమా గెస్ట్ రోల్ కాంబినేషన్. వివరాల్లోకి వెళితే.. సుధీర్ బాబు లేటెస్ట్ చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ. నందిత హీరోయిన్. కన్నడ సూపర్ హిట్ ‘చార్మినార్’కి రిమేక్ ఇది. ఈ చిత్రం లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఓ గెస్ట్ రోల్ లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఇద్దరు యువ హీరోలు ఈ చిత్రంలో అతిధి పాత్రలలో మెరుస్తున్నారు. వారే.. నాగ చైతన్య, దగ్గుబాటి రానా. ఈ సినిమాలో ఓ రెండు సన్నివేశాలలో అలా తళుక్కున మెరిసి మాయమయ్యె పాత్రలలో చైతు, రానాలు కనిపిస్తారని తెలిసింది. ఇప్పటికే దీనికి సంబందిచిన షూటింగ్ పూర్తయింది. మొత్తమ్మీద, మహేష్, చైతు, రానా రూపంలో ఈ చిత్రానికి మాంచి స్పెషల్ ఎట్రాక్షన్ యాడైయిందనే చెప్పాలి. మరీ గెస్ట్ రోల్స్ చిత్ర విజయానికి ఏమేరకు కలిసొస్తాయో చూడాలి.