English | Telugu

త్రిష ఎంగేజ్‌మెంట్ ఫిక్స్ అయ్యింది

గత కొద్ది రోజులుగా హీరోయిన్ త్రిష ఎంగేజ్‌మెంట్ జరిగిపోయిందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. ఆ వార్తలను త్రిష ఖండించింది.కానీ మరో శుభవార్త తెలియజేసింది. తన ఈనెల 23న జరగనున్నట్లు త్రిష స్వయంగా ట్విట్టర్లో తెలియజేసింది. సినీ నిర్మాత వరుణ్ మణియన్‌తో త్రిషకు నిశ్చితార్థం జరగనుంది. అయితే గతంలో ఎన్నోసార్లు త్రిష పెళ్ళి చేసుకోబోతోందన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈసారి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. సినీ నిర్మాత వరుణ్ మణియన్‌తో త్రిష పెళ్ళి కాబోతోందని వార్తలు కూడా గతంలో వచ్చాయి. వీరిద్దరూ కలసి వున్న ఫొటోలు కూడా నెట్‌లో హల్ చల్ చేశాయి. అయితే ఈ సారి త్రిష స్వయంగా తెలియజేయడంతో మీడియా మొత్తం లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. మొత్తమ్మీద త్రిష ఎంగేజ్‌మెంట్‌ ఖరారైంది.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.