English | Telugu
మహేష్ ఆశపడ్డ 'మగాడు'
Updated : May 18, 2015
ఇంతకీ మహేష్ బాబు - కొరటాల శివ సినిమా టైటిల్ ఏమిటి?? శ్రీమంతుడు, మగాడు ఈ రెండింటిలో ఏది ఫిక్స్ చేశారు. ప్రస్తుతం మహేష్‌బాబు అభిమానులు ఈ ప్రశ్నకు సమాధానం కోసమే ఎదురుచూస్తున్నారు. మహేష్ - కొరటాల శివ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చేసింది. ఈనెల 31న ట్రైటర్ బయటకు వచ్చేస్తుంది. అయితే ఇప్పటి వరకూ ఈ సినిమా టైటిల్ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ చిత్రానికి మగాడు అనే టైటిల్ పెట్టారని ముందుగా ప్రచారం జరిగింది. ఆ తరవాత శ్రీమంతుడు బయటకు వచ్చింది. ఇప్పటి వరకూ ఈ సినిమాకి శ్రీమంతుడు పేరే ఫిక్సనుకొన్నారు. అయితే ఇప్పుడు మళ్లీ చిత్రబృందం మనసు మార్చుకొని మగాడు టైటిల్ వైపు దృష్టిసారిస్తోందట. శ్రీమంతుడు అయితే క్లాసీగా ఉందని, మగాడు అయితే మాస్‌కి త్వరగా చేరిపోతుందని మహేష్ భావిస్తున్నాడట. మరోవైపు మహేష్ అభిమానులు కూడా 'మగాడు' టైటిల్ బాగుంది.. అదే పెట్టేయండి.. అంటూ ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారట. అయితే కొరటాల శివకు మాత్రం `శ్రీమంతుడు` టైటిల్ పైనే గురి ఉంది. 'మగాడు' అనే టైటిల్ కూడా మరో నిర్మాణ సంస్థ ఆల్రెడీ రిజిస్టర్ చేయించుకొంది. తారకరత్న కథానాయకుడిగా మగాడు అనే పేరు తో ఓ సినిమా తెరకెక్కి.. మధ్యలో ఆగిపోయింది. ఇప్పుడు టైటిల్ ఇవ్వడానికి వాళ్లు బెట్టు చేస్తున్నారు. మహేష్ మనసు పడినా ఆ టైటిల్ మాత్రం చేజిక్కించుకోలేకపోతున్నాడు.