English | Telugu

నిఖిల్‌కి ఇంత క్రేజా??

సినిమా కూడా స్టాక్ మార్కెట్ లాంటిదే. ఎవ‌రి కెరీర్ ఎప్పుడు అప్‌లోఉంటుందో, ఎవ‌రిది డౌన్‌లో ఉంటుందో చెప్ప‌లేం! నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ నిఖిల్ ఓ మోస్త‌రు హీరో! అత‌ని సినిమా విడుద‌ల అయ్యిందంటేనే గ్రేటు. ఇప్పుడు అలా కాదు. శాటిలైట్ హ‌క్కులూ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. స్వామి రారాతో కుర్రాడి రేంజ్ అమాంతంగా మారిపోయింది మ‌రి. ఆ త‌ర‌వాత కార్తికేయ కూడా హిట్ట‌వ్వ‌డంతో.. నిఖిల్ ఓ బుల్లి సూప‌ర్ స్టార్ అయిపోయాడు. సూర్య వ‌ర్సెస్ సూర్య‌కి యావ‌రేజ్ టాక్ వ‌చ్చింది. అయినా స‌రే.. డ‌బ్బులు బాగా వ‌చ్చాయి. ప‌బ్లిసిటీ కూడా క‌లిసొచ్చి, పోటీగా మ‌రో సినిమా లేక‌పోవ‌డంతో నిఖిల్ కొట్టుకొచ్చేశాడు. ఇప్పుడు శాటిలైట్ కూడా బాగానే అమ్ముడుపోయింది. 3.8 కోట్ల‌కు మా టీవీ శాటిలైట్ హ‌క్కుల్ని ద‌క్కించుకొంది. నిఖిల్ సినిమాకి ఇంత రేటు ప‌ల‌క‌డం నిజంగా గ్రేటే. ఈ ఊపు చూసుకొని నిఖిల్ పారితోషికం పెంచేసినా పెంచేయొచ్చు. డిమాండ్ అట్టావుంది మ‌రి.