English | Telugu

ఆ డైరెక్ట‌ర్‌పై మండిప‌డ్డ‌ మ‌హేష్ ?


మ‌హేష్ బాబు ఎవ‌రితో అయినా స‌ర‌దాగా ఉంటాడు. అత‌ని సెన్సార్ హ్యూమ‌ర్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే అంటుంటారు ఆయ‌న‌తో ప‌నిచేసేవాళ్లు. అయితే మ‌హేష్‌కీ కోపం వ‌స్తుందండోయ్‌. ఆ కోపం ఎలా ఉంటుందో, ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌కు అర్థ‌మైంది. ఈమ‌ధ్య కొర‌టాల‌పై మ‌హేష్ సీరియ‌స్ అయ్యాడ‌ని ఫిల్మ్‌న‌గ‌ర్ టాక్‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న చిత్రం.. శ్రీ‌మంతుడు. ఆగ‌స్టు 7న ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తారు. ఈ లోగా ప్ర‌చారం ముమ్మ‌రం చేశారు. అయితే కొర‌టాల ఇంట‌ర్వ్యూల‌పై మ‌హేష్ కాస్త గుర్రుగా ఉన్నాడ‌ని టాక్‌.

ఇంట‌ర్వ్యూలు ఇచ్చినందుకు కాదు, ఆ ఇంట‌ర్వ్యూల‌లో క‌థంతా పూస గూచిన‌ట్టు చెప్పేస్తున్నాడ‌ని. ఊరి ద‌త్త‌త నేప‌థ్యంలో సాగే చిత్ర‌మిది. ఆ పాయింట్‌ని ట్రైల‌ర్‌లోనే రివీల్ చేసేశారు. అయితే ప‌దే ప‌దే.. అదే పాయింట్‌ని, దాని వెనుక ఉన్న క‌థ‌నీ... కొర‌టాల మీడియాకు లీక్ చేస్తున్నాడ‌ని, క‌థ తెలిసిపోతే సినిమా చూడ్డంలో ఇంట్ర‌స్ట్ ఏముంటుంద‌ని మ‌హేష్ కోప్ప‌డుతున్నాడ‌ట‌. అస‌లు ట్రైల‌ర్‌లోనే ద‌త్త‌త అనే డైలాగులు వినిపించ‌డ‌మే మ‌హేష్‌కి ఇష్టం లేద‌ట‌. ఏదైతే యూనిక్ పాయింట్ అనుకొన్నామో, ఆ పాయింట్‌ని ముందే రివీల్ చేస్తే.. ఇక చూడ్డానికి ఏం మిగులుతుంద‌ని మ‌హేష్ కొర‌టాల‌ని క్వ‌శ్చ‌న్ చేస్తున్నాడ‌ట‌. అదీ పాయింటే క‌దా..??

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.