English | Telugu
ఆగడు ఆగుతుందా !!!
Updated : Jun 5, 2014
మూడు రోజుల్లో ఆగడు టీజర్ పది లక్షల హిట్స్ సాధించింది. ఇది మహేష్ కున్న క్రేజా, లేక టీజర్‌లో ఉన్న కాంట్రవర్సీ వలనా అనేది పక్కన పెడితే.. ఈ టీజర్ విడుదలైనప్పటి నుంచి ప్రిన్స్ అభిమానులు పవన్ అభిమానుల మధ్య కామెంట్ల వార్ జరుగుతోంది.
'ప్రతి ఓడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపేరిజన్లు ... ఎలపరం వచ్చేస్తోంది..." అనే డైలాగు పవన్ కళ్యాణ్‌ని, బాలకృష్ణని ఉద్దేశ్యించి చేసినవిగా భావించి పవన్ ఫ్యాన్స్ తో పాటు, బాలకృష్ణ ఫ్యాన్స్ కూడా ఈ తగువులో పాలు పంచుకుంటున్నారు.
ఇంటర్నెట్ లో ఒక రేంజ్ లో సాగుతున్న ఈ పోరుకి ఫుల్ స్టాప్ పెట్టడానికి మహేష్ తొలి ప్రయత్నం చేశారు. బుధవారం, హైదరాబాదులో ఒక మొబైల్ కంపెనీ నిర్వహించిన అవార్డ్ ఫంక్షన్ లో పాల్గొన్న మహేష్ మీడియాతో మాట్లాడారు. ఈ సినిమాలో పులులు, సింహాలు అని చెప్పిన డైలాగ్ సినిమా ఎవరినీ ఉద్దేశించినది కాదని, టాప్ హీరోలందరి మీద తనకు గౌరవం వుందని చెప్పుకొచ్చారు.ఈ టీజర్ రిలీజ్ చెయ్యటంలో ఎవరినీ విమర్శించే ఉద్దేశ్యం లేదని వివరించారు. అలాగే ఇలాంటి డైలాగ్ దూకుడు సినిమాలో కూడా తాను చెప్పానని గుర్తుచేశారు. ఆగడు సృష్టించిన రగడ మహేష్ నేరుగా ఇచ్చిన క్లారిటీతోనైనా ఆగుతుందేమో చూడాలి.