English | Telugu
తమిళనటి మనోరమకి సీరియస్!
Updated : Jun 5, 2014
ప్రముఖ తమిళ నటి మనోరమ అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. తెలుగు, తమిళ భాషలతో పాటు పలు భాషల్లో నటించిన మనోరమ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శారీరక అనారోగ్యంతోపాటు మానసిక అనారోగ్యంతో కూడా ఆమె గత కొంతకాలంగా బాధపడుతున్నారు. మనోరమ ఎంతోకాలంగా శ్వాస సంబంధింత సమస్యతో బాధపడుతున్నారు. ఆ వ్యాధి బాగా ముదిరిపోవడంతో మంగళవారం నాడు ఆమెను చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. శ్వాస సంబంధిత వ్యాధితోపాటు మనోరమ రక్తంలో పోటాషియం తక్కువుగా వుందని, మరో రెండు రోజుల పాటు చికిత్స తీసుకోవాలని వైద్యలు చెబుతున్నారు. మనోరమ ఎదుర్కొంటున్న ఆనారోగ్య సమస్య తీవ్రంగానే వుందని, ప్రస్తుతం ఆమె కండీషన్ సీరియస్‌గానే వుందని, అయితే ఆమె చికిత్సకు స్పందిస్తున్నారని, మనోరమ రెండు మూడు రోజుల్లో నార్మల్ అయ్యే అవకాశం వుందని డాక్టర్లు చెబుతున్నారు. మే నెలలోనే మనోరమ తన 77వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు.