English | Telugu

అంచనాలకు చేరని మహేష్ 1

భారీ అంచనాలతో తెరకెక్కిన మహేష్ "1" చిత్రం నేడు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను తారుమారు చేసింది. కథ కొత్తగా ఉందని ప్రయత్నించినా కూడా... అది జనాలకు అంతగా నచ్చక ప్రేక్షకులకు నీరసం వచ్చేసింది. హాలీవుడ్ రేంజులో మహేష్ ను చూపించాలని దర్శకుడు సుకుమార్ బాగానే ప్రయత్నించిన కూడా తెలుగు జనాలకు మాత్రం వింతగా అనిపించింది. పైగా మహేష్ నటించిన ప్రతి సినిమాలో కూడా ఎంతో కొంత కామెడి చేస్తూనే వస్తున్నాడు. కానీ ఈ "1" లో ఎక్కడా కూడా నవ్వకుండా.. పూర్తిగా సీరియస్ గా ఉండటంతో లేడి ఫ్యాన్స్ కు అంతగా చేరువకాలేకపోయింది. అంతేకాకుండా ఒకే పనిగా యాక్షన్, ఫైట్స్ ఉండటం వలన మరింత తలనొప్పిగా మారిపోయింది. మహేష్ తనయుడు గౌతమ్ అద్భుతంగా నటించాడు. కానీ వరుస హిట్ సినిమాల వలన మహేష్ "1" పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. దాంతో "1" సినిమాను జనాలు ఊహించుకున్న స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దేవిశ్రీప్రసాద్ సంగీతం పరవాలేదనిపించింది. మహేష్ నటన కొత్తగా ఏం లేకపోయినా కూడా... డ్యాన్సులు కొత్తగా ఉన్నాయి. కానీ సినిమాకు వస్తున్న స్పందన పూర్తిగా డివైడ్ టాక్ గా ఉంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో మరికొద్ది రోజుల్లో తెలియనున్నది

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .