English | Telugu
మహర్ యోధ్ 1818.. తొలి ప్రయత్నమే భారీగా!
Updated : Oct 26, 2023
మాయపేటిక, శ్రీవల్లి వంటి పలు చిత్రాల్లో నటించిన యువ హీరో రజత్ రాఘవ్, ముంబయ్ అందాల భామ ఐశ్వర్య రాజ్ బకుని జంటగా నటిస్తున్న చిత్రం 'మహర్ యోధ్ 1818'. డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై రాజు గుడిగుంట్ల దర్శకత్వంలో సువర్ణ రాజు దాసరి నిర్మిస్తున్న ఈ సోషల్ థ్రిల్లర్, యాక్షన్, ఫాంటసీ చిత్రం పూజా కార్యక్రమాలతో భద్రకాళీ పీఠం పీఠాదీశ్వరి శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ సింధు మాతాజీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని సారధి స్టూడియోలో అక్టోబర్ 26 న ఘనంగా ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఏ.పి. యస్.సి. సెల్ కమీషనర్ విక్టర్ ప్రసాద్ హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ధమాకా దర్శకుడు నక్కింటి త్రినాథరావు గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర యూనిట్ పాల్గొని, సినిమా విశేషాలను మీడియాకు వెల్లడించారు.
మహా-శశాంక్ ద్వయం ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా వెంకట్, ఎడిటర్ గా నందమూరి హరి వ్యవహరిస్తున్నారు.