English | Telugu
షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చిన మెగా హీరోలు.. ఎందుకంటే!
Updated : Oct 26, 2023
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్ళి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. జూన్‌లో ఎంగేజ్‌మెంట్ జరిగింది. కొంతకాలంగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో ఉన్న ఈ జంట మరో వారంలో పెళ్ళి చేసుకోబోతోంది. తాజాగా ఈ జంట వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వెడ్డింగ్ కార్డులో వరుణ్ తేజ్.. నాయనమ్మ-తాతయ్యల పేర్లతో పాటు పెదనాన్న చిరంజీవి, బాబాయ్ పవన్ కళ్యాణ్, అన్నయ్య రామ్‌చరణ్ పేర్లను కూడా ప్రింట్ చేశారు. ఇటలీలోని టుస్కానీ నగరంలో అక్టోబర్ 30 నుంచి వీరి పెళ్ళి వేడుక మొదలు కాబోతోంది. నవంబర్ 1న వరుణ్, లావణ్యల వివాహం జరగనుంది.
రేపు అంటే అక్టోబర్ 27న మెగా ఫ్యామిలీ అంతా ఇటలీకి బయలుదేరనున్నారట. ఈ పెళ్ళికి మెగా ఫ్యామిలీ, అల్లు కుటుంబ సభ్యులు, లావణ్య త్రిపాఠి ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే హాజరు కాబోతున్నారు. నవంబర్ 5న హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ హాల్‌లో బంధుమిత్రులు, స్నేహితులు, సినీ సెలబ్రిటీస్, మరికొంతమంది ప్రముఖులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారట. ఈ పెళ్ళి వేడుకలో పాల్గొనేందుకు మెగా హీరోలంతా తమ సినిమాల షూటింగ్స్‌కి బ్రేక్ చెప్పేశారు. పవన్ కల్యాణ్ ఈ పెళ్ళికి హాజరవుతున్నాడా? లేదా? అనేదే అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. ప్రస్తుతం ఎ.పి., తెలంగాణ ఎన్నికల హడావిడిలో ఉన్న పవన్ ఈ పెళ్ళికి హాజరవుతాడా? లేదా? అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.