English | Telugu

'లడ్డూబాబు' పాటలు త్వరలో

రవిబాబు సినిమాలన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. తొలి చిత్రం 'అల్లరి'లో వినోదాన్ని వినూత్నంగా ఆవిష్కరించి, ఓ ట్రెండ్ సృష్టించారు. ఇప్పటివరకు ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలన్నీ ఒక ఎత్తయితే, తాజా చిత్రం 'లడ్డూబాబు' మరో ఎత్తు అనే చెప్పాలి. 'అల్లరి' చిత్రంలో బక్కపలచని నరేష్ ని చూపించిన రవిబాబు 'లడ్డూబాబు'లో భారీకాయుడిగా చూపిస్తున్నారు. ఈ పాత్ర కోసం విదేశీ నిపుణులు నరేష్ కి మేకప్ వేశారు. మేకప్ చేయడానికి కొన్ని గంటలు పట్టడం మాత్రమే కాదు.. తీయడానికి కూడా ఎక్కువ సమయం పట్టింది. ఆహార్యం, అభినయం పరంగా నరేష్ కిది సవాల్ లాంటి పాత్ర. ఈ పాత్రను అద్భుతంగా చేశారు. లడ్డూబాబుగా నరేష్ ఫస్ట్ లుక్ ఇప్పటికే అందర్నీ ఆకట్టుకుంది. దాదాపు పదేళ్ల తర్వాత రవిబాబు, నరేష్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం కావడం, నరేష్ లుక్ వినూత్నంగా ఉండటం ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేసే మంచి చిత్రం అందించాలనే లక్ష్యంతో త్రిపురనేని రాజేంద్ర ఈ చిత్రాన్ని నిర్మించారు.నరేష్ పాత్రకు సంబంధించిన మేకప్ కోసమే ఆయన భారీగా ఖర్చు పెట్టారు. ఏ విషయంలోనూ రాజీ పడకుండా రాజేంద్ర ఈ చిత్రం నిర్మించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో పాటలను, మార్చి 28న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారు.


భూమిక, పూర్ణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, అలీ, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, ఎమ్మెస్ నారాయణ, కృష్ణబాబు, కొండవలస, ఎల్బీ శ్రీరాం, ఏవీయస్, గిరిబాబు, రాళ్లపల్లి, తెలంగాణ శకుంతల తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: చక్రి, కెమెరా: సుధాకర్ రెడ్డి, స్క్రీన్ ప్లే: సత్యానంద్, మాటలు: నివాస్, పాటలు: భాస్కరభట్ల, ఆర్ట్: నారాయణరెడ్డి ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, రచన-దర్శకత్వం: రవిబాబు, నిర్మాత: త్రిపురనేని రాజేంద్ర.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .