English | Telugu

స్టార్ హీరో కొడుకుతో ఉప్పెన భామ రొమాన్స్! 

'ఉప్పెన' తో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన హీరోయిన్ 'కృతిశెట్టి'(Krithi Shetty).మొదటి చిత్రమే అయినా, ఎంతో బరువుతో కూడిన క్యారక్టర్ లో పరిణితి చెందిన నటనని ప్రదర్శించింది. ఆ తర్వాత చేసిన శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు కూడా హిట్ కావడంతో, కృతి శెట్టి నెంబర్ వన్ హీరోయిన్ గా నిలబడుతుందని అనుకున్నారు. కానీ మాచర్ల నియోజకవర్గం, ది వారియర్, కస్టడీ, ఇలా వరుసగా ఐదు సినిమాలు ప్లాప్ గా నిలవడంతో అవకాశాలు తగ్గాయి. ప్రస్తుతం తమిళంలో ప్రదీప్ రంగనాధన్ తో కలిసి 'లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ' అనే మూవీ చేస్తుండగా, ఈ నెల 17 న విడుదల కానుంది.

కృతి శెట్టి త్వరలోనే బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతోందనే న్యూస్ సినీ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. ప్రముఖ నటుడు గోవింద(Govinda)కుమారుడు 'యశ్వర్ధన్‌ అహుజా'(Yashvardhan Ahuja)తో కృతిశెట్టి జోడి కట్టనుందని, సదరు చిత్రం రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ని ప్రముఖ బాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ నిర్మించబోతుండగా, అగ్ర దర్శకుడు సాజిద్‌ ఖాన్(Sajid Khan)తెరకెక్కిస్తున్నట్టుగా కూడా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ పనులు, క్యాస్టింగ్‌ దశలో ఉందని, త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందనే న్యూస్ కూడా ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది.

దక్షిణాదిలో సూపర్‌హిట్‌ గా నిలిచిన ఒక చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కనుందని టాక్ కూడా వినపడుతుంది. ఈ మూవీ తర్వాత కృతిశెట్టి బాలీవుడ్‌ పైనే పూర్తిగా తన దృష్టి పెట్టనుందని సమాచారం.బెంగుళూరుకి చెందిన కృతి శెట్టి 2019 లో హృతిక్ రోషన్ , మృణాల్ ఠాకూర్ జంటగా వచ్చిన 'సూపర్ 30 ' మూవీలో ఒక స్టూడెంట్ గా కనిపించింది. ఇప్పుడు హీరోయిన్ గా బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. మరి బాలీవుడ్ ని కృతిశెట్టి ఏ మేర మెప్పిస్తుందో చూడాలి. 2021 లో ఉప్పెన రిలీజైన విషయం తెలిసిందే.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.