English | Telugu
యశ్ ని డైరెక్ట్ చేస్తున్న ఈవీవీ హీరోయిన్.. గోవాలో మాములుగా ఉండదు మరి..
Updated : Sep 13, 2023
కేజీఎఫ్ సిరీస్ తో నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నారు కన్నడ నటుడు యశ్. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో సాగే సదరు సిరీస్ లో రాకీ భాయ్ గా తన స్టైలిష్ పెర్ఫార్మెన్స్ తో ఇంప్రెస్ చేశారు ఈ టాలెంటెడ్ స్టార్.
ఇదిలా ఉంటే, కేజీఎఫ్ 2 తరువాత కొత్త సినిమాని మొదలుపెట్టని యశ్.. త్వరలో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ని ప్రారంభించనున్నారు. గోవా నేపథ్యంలో సాగే ఈ పాన్ ఇండియా మూవీ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది. సరికొత్త కథాంశంతో రూపొందనున్న ఈ మూవీ.. సమ్ థింగ్ స్పెషల్ గా ఉంటుందని సమాచారం. కాగా, ఈ చిత్రాన్ని మలయాళ నటి, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ తెరకెక్కించబోతున్నారు. తెలుగువారికి కూడా గీతూ మోహన్ దాస్ పరిచితమే. 2001లో విడుదలైన ఈవీవీ సత్యనారాయణ డైరెక్టోరియల్ వీడెక్కడి మొగుడండీ..!లో ఈమె ఓ నాయికగా నటించారు. మరి.. లేడీ డైరెక్టర్ తో యశ్ చేయనున్న ఈ భారీ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.