English | Telugu
'సలార్' రిలీజ్ డేట్.. ఎట్టకేలకు స్పందించిన మేకర్స్
Updated : Sep 13, 2023
అధికారిక ప్రకటన రానప్పటికీ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సిన 'సలార్' సినిమా వాయిదా పడిందన్న విషయంపై దాదాపు అందరికీ క్లారిటీ వచ్చేసింది. అయితే ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించి, కొత్త విడుదల తేదీపై క్లారిటీ ఇస్తారని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు స్పందించిన మేకర్స్ సినిమాని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కానీ కొత్త రిలీజ్ డేట్ పై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'సలార్'. ఈ సినిమా మొదటిభాగం 'సీజ్ ఫైర్'ను ఈ సెప్టెంబర్ 28 న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే సీజీ వర్క్ పట్ల దర్శకుడు సంతృప్తిగా లేకపోవడంతో.. సినిమాని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నట్లు వార్తలొచ్చాయి.
తాజాగా హోంబలే ఫిలిమ్స్ సోషల్ మీడియా వేదికగా వాయిదా విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 28న సలార్ ని విడుదల చేయలేకపోతున్నామని, బెస్ట్ అవుట్ పుట్ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, కొత్త విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. కాగా సలార్ ని నవంబర్ లేదా డిసెంబర్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.