English | Telugu
వల్లంకి పిట్ట.. హ్యాట్రిక్ పట్టేనా!?
Updated : Aug 5, 2023
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డెబ్యూ మూవీ 'గంగోత్రి' (2003)లో.. చిన్నారి గంగోత్రిగా భలేగా ఆకట్టుకుంది బేబి కావ్య కళ్యాణ్ రామ్. అందులోని "వల్లంకి పిట్ట" పాటతో తెలుగువారందరికీ బాగా చేరువైన కావ్య.. ఆపై 'ఠాగూర్', 'అడవి రాముడు', 'బాలు'తో సహా కొన్ని చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా అలరించింది. కొన్నాళ్ళ పాటు నటనకు బ్రేక్ ఇచ్చిన కావ్య.. ఇటీవల కథానాయికగా సరికొత్త అవతారమెత్తింది.
ఇందులో భాగంగా.. గతేడాది 'మసూద'తో ఫస్ట్ టైమ్ తెరపై హీరోయిన్ గా సందడి చేసింది. నాయికగా మొదటి సక్సెస్ అందుకుంది. ఇక ఈ సంవత్సరం ఆరంభంలో వచ్చిన 'బలగం'తో అఖండ విజయం అందుకుంది. ఇలా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయిన కావ్య.. ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేసింది. 'మత్తు వదలరా' ఫేమ్ సింహా కోడూరికి జతగా ఆమె నటించిన 'ఉస్తాద్' ఆగస్టు 12న విడుదలకు సిద్ధమైంది. మరి.. ఇప్పటికే రెండు విజయాలతో మంచి ఊపు మీదున్న కావ్య.. 'ఉస్తాద్'తో హ్యాట్రిక్ కొడుతుందేమో చూడాలి.