English | Telugu

"కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం అప్పల్రాజు"ఫిబ్రవరి 18 న

సంచలన వివాదాస్పద దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ దర్శకత్వంలో,సునీల్ హీరోగా, స్వాతి హీరోయిన్ గా, తెలుగు సినీ రంగం మీద సెటైరికల్ కామెడీ చిత్రంగా, కోనేరు కిరణ్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం "కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం అప్పల్రాజు".ఈ "కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం అప్పల్రాజు" చిత్రంలోబ్రహ్మానందం ఒక పాట కూడా పాడారు."కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం అప్పల్రాజు" నిజానికి డిసెంబర్ నెలలో విడుదలవుతుందని వినపడింది.

తర్వాత జనవరినెల మొదటి వారంలో విడుదలవుతుందన్నారు.ఆ తర్వాత సంక్రాంతి పండుగకు విడుదలవుతుందని వినపడింది. అదీ కాదు జనవరి నెలాఖరుకి విడుదల చేస్తామని చెప్పారు.మళ్ళీ ఫిబ్రవరి 4 వ తేదీన అన్నారు.ప్రస్తుతం "కథ,స్క్రీన్ ప్లే,దర్శకత్వం అప్పల్రాజు"చిత్రాన్ని ఫిబ్రవరి 18 వ తేదీన విడుదల చేస్తాం అంటున్నారు.ఈసారైనా నిజంగా విడుదలవుతుందంటారా...?

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.