English | Telugu

పవన్ "గబ్బర్ సింగ్ ‍"లో శ్రీకాంత్

"షాక్", "మిరపకాయ్" ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, తన సొంత బ్యానర్ పవన్ కళ్యాణ్ క్రియెటీవ్ వర్క్స్ పతాకంపై,సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా, హిందీలో సూపర్ హిట్టయిన "దబాంగ్" చిత్రాన్ని తెలుగులో "గబ్బర్ సింగ్"పేరుతో పవన్ కళ్యాణ్ స్వయంగా నిర్మిస్తున్నారు.

ఈ "గబ్బర్ సింగ్" చిత్రంలో పవన్ తో పాటు యువ హీరో శ్రీకాంత్ కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తారట.ఈ చిత్రంలో ఛార్మి ఒక ఐటమ్ సాంగ్ లో నటిస్తూంది.ఈ చిత్రం కన్నా కన్నా ముందుగా ప్రముఖ తమిళ దర్శకుడు విష్ణు వర్థన్ దర్శకత్వంలో, పవన్ కళ్యాణ్ హీరోగా నటించే "ది షాడో" చిత్రం ముందుగా ప్రారంభమవుతుందని సమాచారం.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.