English | Telugu
మంచి రేటింగ్స్ సంపాదించిన డబ్బింగ్ చిత్రాలు ఏమిటి!?
Updated : Feb 14, 2023
టాలీవుడ్ లో ప్రతి ఏడాది వందల సంఖ్యలో సినిమాలు నిర్మితమవుతూ ఉంటాయి. వీటితోపాటు తమిళ మలయాళ కన్నడ పరిశ్రమల నుంచి విడుదలైన చిత్రాలు తెలుగులోకి డబ్ అవుతూ ఉంటాయి. అలా డబ్ అయిన చిత్రాలు కూడా ఇక్కడ ఘనవిజయం సాధిస్తుంటాయి. ఇక కమలహాసన్, రజనీకాంత్, సూర్య, కార్తీ ఇలాంటి పరభాష హీరోలకు కూడా ఇక్కడ విపరీతమైన క్రేజ్ ఉంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు అయితే అవి తమిళ్ మలయాళం కన్నడ ఏ భాష అయినా కూడా తెలుగులో మంచి విజయాలను సాధిస్తూ ఉంటాయి.
తెలుగు ప్రేక్షకులు అలాంటి వాటికి బ్రహ్మరథం పడతారు. టాలీవుడ్ లో చాలామంది తమిళ హీరోలు సూపర్ హిట్ లను సొంతం చేసుకున్నారు. బుల్లితెరపై కూడా రికార్డు స్థాయిలో టిఆర్పిలు సొంతం చేసుకున్నారు. తెలుగు హిట్ చిత్రాలకు వచ్చే రేటింగ్ కంటే కొన్ని తమిళ డబ్బింగ్ సినిమాలకు ఎక్కువ టిఆర్పి రావడం విశేషం. ఇందులో మొదటి స్థానం సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన రోబో చిత్రం. దీనికి 19.04 టీఆర్పి వచ్చింది. తరువాత విజయ్ ఆంటోనీ బిచ్చగాడు ఈ సినిమాకు 18.78 టీఆర్పి వచ్చింది. మూడో స్థానంలో రజనీకాంత్ కబాలి చిత్రం 14.5 2 టిఆర్పి తో సొంతం చేసుకుంది. కాంచన 2 చిత్రం 13.1 టిఆర్పిని సొంతం చేసుకుని నాలుగో స్థానంలో ఉంది. ఐదో స్థానంలో 12.35 టిఆర్పి తో రిషబ్ శెట్టి హీరోగా నటించిన దర్శకత్వం వహించిన కాంతారా నిలుస్తోంది.
ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలు కూడా కాంతారా స్థాయిలో రేటింగ్‌ను రాబట్ట లేకపోయాయి. అలాంటి కాంతారా మూవీ బుల్లితెరపై రికార్డు స్థాయిలో టిఆర్పి సొంతం చేసుకోవడం ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏకంగా 60 కోట్లకు పైగా తెలుగులో వసూలు చేయడం విశేషం.