English | Telugu

ఆత్మహత్య ప్రయత్నాన్ని విరమించుకున్నాను

జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులను, ఒత్తిడులను తట్టుకోలేక ఇటీవల కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో హీరో కమల్‌హాసన్‌ ఆ విషయంపై స్పందించారు. ఒక కార్యక్రమంలో దీనిపై మాట్లాడుతూ ‘‘ప్రతి వ్యక్తి జీవితంలో ఒత్తిడి అనేది ఉంటుంది. ఒకవిధంగా ఒత్తిడి ఉంటేనే అనుకున్నది సాధించవచ్చు అనేది సైకియాట్రిస్టులు చెప్తున్న మాట. అయితే దాన్ని నెగెటివ్‌గా తీసుకొని కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆ పరిస్థితి నాకూ వచ్చింది.

నేను 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. నాకు సినిమాల్లో అవకాశాలు రాకపోవడం, నాకు తగినంత గుర్తింపు లభించకపోవడంతో ఎంతో బాధపడ్డాను. అంతలోనే సంభాళించుకొని ఆ ప్రయత్నాని విరమించుకున్నాను. నేను చనిపోతే.. ఎంతో ప్రతిభ ఉన్న కళాకారుడిని కోల్పోయామని చిత్రపరిశ్రమ బాధపడుతుందని భావించాను. అంత కాన్ఫిడెన్స్‌ ఉంది కాబట్టే ఆత్మహత్య ఆలోచనను అధిగమించగలిగాను. ఈ విషయంలో నా గురువు అనంతు చెప్పిన మాటలు నన్ను ఎంతో ఇన్‌స్పైర్‌ చేశాయి. ‘నీ పని నువ్వు చేసుకుపో. సమయం వచ్చినపుడు నీకు గుర్తింపు దానంతట అదే వస్తుంది’ అని ధైర్యం చెప్పారు. ఆయన మాటలు విన్న తర్వాత ఆత్మహత్య చేసుకోవడం ఎంత తప్పో అర్థమైంది. నా దృష్టిలో హత్య చేయడం ఎంత నేరమో, ఆత్మహత్య చేసుకోవడం కూడా అంతే నేరం. జీవితం ఎంత చీకటి మయం అయిపోయినా ఏదో ఒక రోజు వెలుగు అనేది కనిపిస్తుంది. అప్పటివరకు ఓపిక ఎదురుచూస్తూ మన కర్తవ్యం మనం నిర్వర్తించాలి. అబ్దుల్‌ కలాంగారు చెప్పినట్టు ‘నిద్రపోయినప్పుడు వచ్చేది కాదు కల అంటే.. మనల్ని నిద్రపోనివ్వకుండా చేసేదే అసలైన కల’. ప్రతిరోజూ రాత్రి నిద్రపోయే ముందు మీ కలను, లక్ష్యాన్ని గుర్తు చేసుకోండి. దాని కోసం ఎంత కృషి చేయాలి అనేది ఆలోచించి ఆ ప్రకారం ముందుకు వెళ్లాలి. మిమ్మల్ని తప్పకుండా విజయం వరిస్తుంది’ అని చెప్పిన కమల్‌హాసన్‌ మాటలు కార్యక్రమానికి వచ్చిన వారిని ఎంతో ఇన్‌స్పైర్‌ చేశాయి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .