English | Telugu

అప్పుడే 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్.. బెస్ట్ ఫిల్మ్ గా ఆస్కార్ గెలవడమే టార్గెట్!

భారతీయ సినీ పరిశ్రమలోనే నెంబర్ వన్ దర్శకుడు గా వెలుగొందుతున్న దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. జక్కన్న దర్శకత్వంలో సినిమా వస్తుందంటే చాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తి తో ఎదురుచూస్తూ ఉంటారు. గత సంవత్సరం ఆయన దర్శకత్వం లో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా వచ్చిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. తెలుగు తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదలై కలక్షన్ల పరంగా సంచలనం సృష్టించింది. అంతేకాకుండా ఇంతవరకు తెలుగు సినిమా సాధించని ఆస్కార్ అవార్డుని సైతం సాధించి తెలుగు వాడి సత్తాని ప్రపంచ సినిమా వేదిక దగ్గర చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసింది. ప్రస్తుతం రాజమౌళి తెలుగు సినిమా దర్శకుడు మాత్రమే కాదు ప్రపంచ సినిమా దర్శకుడు.

ఇప్పుడు మరో సారి 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రపంచవ్యాప్తంగా తన సత్తాని తెలియ చెయ్యడానికి సిద్ధం అవుతుంది. ప్రస్తుతం జక్కన్న తన తదుపరి చిత్రంగా సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు తో తెరకెక్కించబోయే సినిమాకి సంబంధించిన కథా చర్చల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆ సినిమా తర్వాత ఆర్ఆర్ఆర్ కి సీక్వెల్ ఉంటుందనే వార్త ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతుంది. ఆల్రెడీ ఆర్ఆర్ఆర్ కి పార్ట్ -2 ఉంటుందని గతంలో ఆర్ఆర్ఆర్ చిత్ర రచయిత విజయేంద్రప్రసాద్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఇప్పుడు లేటెస్టుగా ఆర్ఆర్ఆర్ కి సీక్వెల్ పక్కాగా ఉంటుందన్న వార్తతో ఆర్ఆర్ఆర్ మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ ఇంకా పెద్ద ఘన విజయం సాధించడంతో పాటు ఈ సారి ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు ని గెలుచుకోవాలని రాజమౌళి అభిమానుల తో పాటు ఎన్టీఆర్ ,రామ్ చరణ్ అభిమానులు కోరుకుంటున్నారు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.