English | Telugu

సూర్య, కార్తీలపై కాజల్ ప్రశంసలు

సూర్య, కార్తీలపై కాజల్ ప్రశంసలు కురిపిస్తోంది. వివరాల్లోకి వెళితే ప్రముఖ తమిళ హీరోలు సూర్య, కార్తీ ఇద్దరూ సినిమాల్లో నటించినట్లుండదనీ, వారి నటన సహజంగా ఉంటుందనీ ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ప్రశంసిస్తోంది. సూర్య, కార్తీ ఈ ఇద్దరు అన్నదమ్ములూ బయట ఎంతో మామూలుగా కనిపిస్తారనీ, కెమెరా ముందుకు రాగానే వారి బాడీ లాంగ్వేజ్, హావభావాలు వారి నటించే పాత్రకు చక్కగా సరిపోయేలా మారిపోతాయనీ, అది తనకు ఆశ్చర్యం కలిగించే విషయమనీ కాజల్ అంటూంది.

సూర్య, కార్తీ ఇద్దరూ తమ సినిమాల్లో నటించరనీ, జస్ట్ బిహేవ్ చేస్తారని కూడా కాజల్ అంటోంది. తమిళ్ సినిమాల్లో వేషాల కోసమే కాజల్ ఇలా సూర్య, కార్తీ ఇద్దరికీ ఈ విధమగా సోప్ వేస్తోందనీ, అదీకాక "నేను ముమబాయి అమ్మాయిని...సౌతిండియన్ ని కాదు" అని చెప్పి వివాదాల్లో ఇరుక్కున్న కాజల్ కి మద్దతు కావలి కబట్టే ఇలా మాట్లాడుతూందని సినీ పండితులంటున్నారు. లేకపోతే మరి ఇలా ప్రశంసించటానికి తెలుగు హీరోలు కాజల్ కి ఎందుకు గుర్తుకు రారో అర్థం కాదు.