English | Telugu
బావమరిది కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్
Updated : Oct 3, 2023
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్'. ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా పరిచయమవుతుండటం విశేషం. ఇందులో నితిన్ తో పాటు సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలు పోషించారు. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన మ్యాడ్ మూవీ.. అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని ప్రేక్షకులకు మరింత చేరువ చేసే బాధ్యతను ఎన్టీఆర్ తీసుకున్నాడు.
'మ్యాడ్' ట్రైలర్ ను ఈరోజు(అక్టోబర్ 3) ఉదయం ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ విడుదల చేశాడు. వినోదంతో నిండిన మ్యాడ్ ట్రైలర్ తనకు ఎంతగానో నచ్చిందని చెప్పిన ఎన్టీఆర్.. టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. కాలేజ్ స్టూడెంట్స్ లైఫ్ ని చూపిస్తూ ట్రైలర్ ఎంతో సరదాగా సాగింది. జాతిరత్నాలు సినిమాకి పని చేసిన కళ్యాణ్ శంకర్ ఈ సినిమాని కూడా ఆ తరహా కామెడీతోనే తెరకెక్కించారని తెలుస్తోంది. అంతేకాదు ఇందులో జాతిరత్నాలు దర్శకుడు అనుదీప్ కూడా నటించడం విశేషం.