English | Telugu

గాయంతోనే కాంతార ఈవెంట్ కి ఎన్టీఆర్.. నొప్పి భరించలేక మధ్యలోనే...

స్నేహానికి జూనియర్ ఎన్టీఆర్ ఎంత విలువ ఇస్తాడో మరోసారి రుజువైంది. తాజాగా హైదరాబాద్ లో 'కాంతార చాప్టర్ 1' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యాడు. అయితే గాయంతో నొప్పిని భరిస్తూ.. ఆయన ఈవెంట్ కి హాజరు కావడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. (Jr NTR)

ఇటీవల ఓ యాడ్ షూటింగ్ లో ఎన్టీఆర్ కి గాయమైన సంగతి తెలిసిందే. వైద్యులు రెండు వారాలు విశ్రాంతి తీసుకోమని సూచించారు. అయినప్పటికీ ఎన్టీఆర్ తన వల్ల ఆ యాడ్ మేకింగ్ టీం నష్టపోకూడదని.. నొప్పితోనే ఆ యాడ్ షూటింగ్ ని పూర్తి చేశాడు. ఇంకా ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఎన్టీఆర్.. తాజాగా తన స్నేహితుడు రిషబ్ శెట్టి కోసం 'కాంతార చాప్టర్ 1' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరయ్యాడు. (Kantara Chapter 1)

కాంతార ఈవెంట్ లో ఎన్టీఆర్ ఇబ్బంది పడటం స్పష్టంగా కనిపించింది. స్పీచ్ స్టార్ట్ చేసే ముందే.. గాయం వల్ల తాను గట్టిగా మాట్లాడలేనని చెప్పాడు. ఆ తర్వాత రిషబ్ పై ప్రశంసలు కురిపించాడు. చిన్నప్పుడు తన అమ్మమ్మ దగ్గర పంజుర్లీ గురించి విన్నానని, ఆ కథను ఎవరైనా సినిమాగా తీయగలరా అనుకున్నాను. అలాంటిది, తనకంటే గొప్పగా ఎవరూ తీయలేరు అనేలా.. తన సోదరుడు రిషబ్ తీసి చూపించాడని ఎన్టీఆర్ ప్రశంసించాడు. 'కాంతార చాప్టర్ 1' కోసం రిషబ్ తో పాటు, టీం అంతా ఎంత కష్టపడ్డారో.. తాను కర్ణాటక వెళ్ళినప్పుడు స్వయంగా చూశానని చెప్పాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వాలని విష్ చేశాడు. ఆ తర్వాత ఇంకా మాట్లాడాలని ఉందని, కానీ నొప్పి వల్ల ఎక్కువసేపు నిల్చోలేకపోతున్నాను అంటూ తన స్పీచ్ ని ముగించాడు ఎన్టీఆర్.

ఎన్టీఆర్ అంటేనే పవర్ ఫుల్ స్పీచ్ లకి పెట్టింది పేరు. అలాంటి ఎన్టీఆర్ ఇలా వేదికపై ఇబ్బంది పడటం చూసి.. ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఫ్రెండ్ కోసం నొప్పిని భరిస్తూ ఈవెంట్ కి వచ్చిన ఆయన మంచి మనసుకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.