English | Telugu

రూ. 900 కోట్ల క్లబ్ లో 'జవాన్'.. 13 రోజుల కలెక్షన్స్ ఇవే


బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ద్విపాత్రాభినయం చేసిన 'జవాన్' సినిమా.. తాజాగా రూ. 900 కోట్ల క్లబ్ లో చేరింది. సెప్టెంబర్ 7న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ చిత్రం.. మంగళవారంతో 13 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకుంది. ఈ 13 రోజుల్లో రూ. 906. 85 కోట్ల గ్రాస్ చూసిన ఈ సినిమా.. ఇదే జోరు వచ్చే వీకెండ్ వరకు కొనసాగిస్తే రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరడం పెద్ద కష్టమేమి కాదంటున్నారు ట్రేడ్ పండితులు.

ఏరియాల వారిగా 'జవాన్' 13 రోజుల కలెక్షన్స్ వివరాలు:
తెలుగు రాష్ట్రాలు: రూ.52. 15 కోట్ల గ్రాస్
తమిళనాడు : రూ.43. 35 కోట్ల గ్రాస్
కర్ణాటక: రూ. 47.10 కోట్ల గ్రాస్
కేరళ: రూ. 13.05 కోట్ల గ్రాస్
రెస్ట్ ఆఫ్ ఇండియా: రూ. 457. 10 కోట్ల గ్రాస్
ఓవర్సీస్: రూ.294.10 కోట్ల గ్రాస్

ప్రపంచవ్యాప్తంగా 13 రోజుల కలెక్షన్స్ : రూ.906.85 కోట్ల గ్రాస్
హిందీ వెర్షన్ 13 రోజుల నెట్: రూ. 457. 59 కోట్లు

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.