English | Telugu
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' 13 రోజుల కలెక్షన్స్.. రూ. 50 కోట్ల క్లబ్ లో చేరేనా?
Updated : Sep 20, 2023
అనుష్కా శెట్టి, నవీన్ పొలిశెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' సినిమా.. మంచి కలెక్షన్స్ రాబడుతూ నెమ్మదిగా బ్లాక్ బస్టర్ బాట పట్టింది. సెప్టెంబర్ 7న జనం ముందు నిలిచిన ఈ కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ.. మంగళవారంతో 13 రోజుల ప్రదర్శన పూర్తిచేసుకుంది. రూ. 13.50 కోట్ల షేర్ బ్రేక్ ఈవెన్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన శెట్టి అండ్ శెట్టి.. ఈ 13 రోజుల్లో రూ. 22 కోట్ల షేర్ రాబట్టింది. అంటే.. ఓవరాల్ గా రూ. 8.50 కోట్ల లాభం చూసిందన్నమాట.
ఇక గ్రాస్ పరంగా చూస్తే.. ఈ మూవీ ఇప్పటివరకు రూ. 42.50 కోట్ల వరకు ఆర్జించింది. సో.. ఫుల్ రన్ లో రూ. 50 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరడం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'కి పెద్ద కష్టమేమి కాకపోవచ్చు అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' 13 రోజుల కలెక్షన్స్ వివరాలు:
నైజాం: రూ. 6.78 కోట్ల షేర్
సీడెడ్ : రూ. 1.15 కోట్ల షేర్
ఆంధ్రా: రూ. 4.65 కోట్ల షేర్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలెక్షన్స్ : రూ.12.58 కోట్ల షేర్
కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా: రూ. 1.70 కోట్ల షేర్
ఓవర్సీస్: రూ.7.72 కోట్ల షేర్
ప్రపంచవ్యాప్తంగా 13 రోజుల కలెక్షన్స్ : రూ.22 కోట్ల షేర్ (రూ. 42.50 కోట్ల గ్రాస్)