Read more!

English | Telugu

జపాన్ సునామి మీద వర్మ సినిమా

జపాన్ సునామి మీద వర్మ సినిమా తీస్తున్నాడా...? గతంలో దావూద్ ఇబ్రహీం, చోటా షకీల్ వంటి గ్యాంగ్ స్టర్ల మీద "కంపెనీ", "సత్య" వంటి సినిమాలు, రాయల సీమ ఫ్యాక్షన్ గొడవల మీద "రక్తచరిత్ర" వర్మ సినిమాలు తీశాడు. ప్రస్తుతం బెజవాడ రౌడీయిజం మీద "బెజవాడ రౌడీలు" అనే సినిమా తీయటానికి సన్నాహాలు చేస్తున్నాడు రామ్ గోపాల వర్మ. అంటే ఏదైనా సెన్సేషనల్ ఇష్యూ కానీ, ఇన్సిడెంట్ కానీ రామ్ గోపాల వర్మ దృష్టికి వస్తే, వెంటనే దాని మీద సినిమా తీస్తాడు రామ్ గోపాల వర్మ.

మరి ఇటీవల జపాన్ లో సంభవించిన సునామీ, భూకంపం, అగ్నిపర్వతాల పేలుడు, న్యూక్లియర్ రియాక్టర్ల పేలుళ్ళ మీద కూడా రామ్ గోపాల వర్మ సినిమాలు తీస్తాడా అన్న అనుమానం ఒక విలేఖరికి వస్తే, అదే ప్రశ్నని రామ్ గోపాల వర్మని అడగ్గా దానికి " ఏంటి...? జపాన్ సునామీ మీద సినిమా తియ్యమంటావా...? అసలే నానా కష్టాల్లో ఉన్న వాళ్ళ మీద ఇలాంటి జోకులేస్తే నిన్నూ, నన్నూ కలిపి జైల్లో పెడతారయ్యా. నువ్వు నాకంటే చాలా నెగెటీవ్ గా ఆలోచిస్తున్నావ్. కాస్త జాగ్రత్త" అని చురకలేశాడు రామ్ గోపాల వర్మ.