Read more!

English | Telugu

రానా హీరోగా హాలీవుడ్ సినిమా

రానా హీరోగా హాలీవుడ్ సినిమా ఒకటి మొదలు కానుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన "లీడర్ ‍" చిత్రం ద్వారా సినీ రమగంలోకి ప్రవేశించిన యువ హీరో రానా ( రామానాయుడు ) ఆ తర్వాత ఉన్నట్టుండి బాలీవుడ్ సినిమా "దమ్ మారో దమ్" చిత్రంలో బిపాసా బసు సరసన హీరోగా నటించాడు.

 

తన మూడవ సినిమా మళ్ళీ తెలుగులోనే నటిస్తున్నాడు రానా. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, ఇలియానా హీరోయిన్ గా, నల్లమలపు శ్రీనివాస్ నిర్మిస్తున్న "నేను - నా రాక్షసి" అనే విభిన్న కథా చిత్రంతో ఏప్రెల్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు యువ హీరో రానా. ఈ చిత్రంలో నటించిన అనంతరం ప్రస్తుతం రానా ఒక హాలీవుడ్ చిత్రంలో హీరోగా నటించటానికి అంగీకరించారని తెలిసింది.

 

గతంలో "రాఖ్" చిత్రానికి దర్శకత్వం వహించిన ఆదిత్య భట్టాచార్య దర్శకత్వం వహిస్తున్న హాలీవుడ్ చిత్రంలో రానా హీరోగా నటించబోతున్నాడని వినికిడి. ఈ హాలీవుడ్ చిత్రం ఈ సంవత్సరం చివర్లో కానీ, వచ్చే యేడాది మొదట్లో కానీ ప్రారంభం కావచ్చని సమాచారం.