English | Telugu
ఇదీ సూపర్ స్టార్ రేంజ్.. దిమ్మతిరిగేలా 'జైలర్' ఓపెనింగ్స్!
Updated : Aug 11, 2023
సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్ మూవీ 'జైలర్' ఊహించినట్లుగానే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ తో సంచలనం సృష్టించింది. మొదటిరోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలన ఓపెనింగ్స్ తో సత్తా చాటింది. జైలర్ జోరు చూస్తుంటే చాలా చోట్ల మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్ సాధించేలా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో రూ.12 కోట్ల బిజినెస్ చేసిన జైలర్.. మొదటి రోజే రూ.7 కోట్ల షేర్ తో ఏకంగా 58 శాతం రికవర్ చేసింది. నైజాంలో రూ.3.21 కోట్ల షేర్, సీడెడ్ లో రూ.94 లక్షల షేర్, ఆంధ్రాలో రూ.2.86 కోట్ల షేర్ తో.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కలిపి ఫస్ట్ డే రూ.7.01 కోట్ల షేర్ సాధించింది. తెలుగునాట మరో రెండు మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించినా ఆశ్చర్యంలేదు.
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని పరిశీలిస్తే తమిళనాడులో రూ.22.85 కోట్ల గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో రూ.12.50 కోట్ల గ్రాస్, కర్ణాటకలో రూ.11.80 కోట్ల గ్రాస్, కేరళలో రూ.5.85 కోట్ల గ్రాస్, రెస్టాఫ్ ఇండియా రూ.3.10 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో రూ.35.10 కోట్ల గ్రాస్ రాబట్టింది. దీంతో మొదటి రోజు రూ.91.20 కోట్ల గ్రాస్(రూ.44.75 కోట్ల షేర్) వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గా రూ.123 కోట్ల బిజినెస్ చేసిన ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా రూ.78 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు ఓపెనింగ్స్ రికార్డు స్థాయిలో ఉండటంతో వారం పది రోజుల్లో లాభాల్లోకి ఎంటర్ అయ్యే అవకాశముంది.