English | Telugu
ఇన్ స్టాగ్రామ్ లో ఇనయా సుల్తానా కొత్త మూవీ కబుర్లు!
Updated : Apr 15, 2023
బిగ్ బాస్ సీజన్-6 తో ఫేమస్ అయిన వారిలో ఇనయా సుల్తానా ఒకరు. బిగ్ బాస్ లో ఉన్నంతవరకు టాస్క్ లలో ఆడపులిలా ఆడిన ఇనయా సుల్తానా.. బయటకు వచ్చేసరికి తనకంటూ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకొని, ఎవరూ ఊహించనంత క్రేజ్ ని సంపాదించుకుంది. బిగ్ బాస్ కి ముందు ఆర్జీవీతో డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ కావడంతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఇనయా. దాంతో బిగ్ బాస్ లో అవకాశం కొట్టేసి ఫేమస్ అయింది.
ఇనయా తన ఫ్యామిలీని వదిలి ఇండస్ట్రీకి వచ్చిందని చాలాసార్లు చెప్పింది. సినిమాల మీద మక్కువతో ఎన్నో రోజులు సినిమా ఆఫీస్ ల చుట్టూ తిరిగానని చెప్పిన ఇనయా.. మూడు సినిమాలలో నటించిందని చెప్పింది. అయితే తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఆస్క్ మీ క్వశ్చన్ ఎబోట్ నటరత్నాలు మూవీ అని పోస్ట్ చేసింది. ఇందులో తన అభిమానులు పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడుగగా.. ఇనయా ఓపికగా సమాధానాలు చెప్పుకొచ్చింది. నేను మీ అభిమానిని.. బిగ్ బాస్ లో మీరు చాలా మంది గర్ల్స్ కి ఇన్సిపిరేషన్.. హ్యాట్సాఫ్ టు యూ అని ఒక అభిమాని చెప్పగా.. దానికి సమాధానంగా థాంక్స్ అండ్ లవ్ యూ సో మచ్ రా.. నిన్ను నువ్వు నమ్ముకో.. అసాధ్యమైన దానిని కూడా గెలవొచ్చని సలాహా ఇచ్చింది ఇనయా. మీరు చేసిన ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది మేడమ్ అని ఒకరు అడుగగా.. డైరెక్టర్ రాబోయే నెల అని అన్నాడు.. అన్నీ సెట్ అయితే మే నెలలో థియేటర్లలో చూద్దామని ఇనయా అంది. ఈ సినిమాలో మొత్తం నటీనటుల కొత్తవారేనా మేడమ్ అని ఒకరు అడుగగా.. దాదాపు అందరు తెలిసినవాళ్ళే అని చెప్పింది. షూటింగ్ కంప్లీట్ అయిందా మేడమ్ అని మరొకరు అడుగగా.. ఎస్ అంటూ రిప్లై ఇచ్చింది ఇనయా.
ఈ మూవీలో మీ రోల్ ఏంటని ఒకరు అడుగగా.. హీరోయిన్ అని ఇనయా చెప్పింది. బిగ్ బాస్ తో ఫేమస్ అయినవాళ్ళలో హీరోయిన్ ఎవరూ లేరు అని ఒకరు అడుగగా.. థాంక్ గాడ్.. నేను బిగ్ బాస్ కి ముందే మూడు సినిమాలని తీసానని గర్వంగా చెప్పింది ఇనయా. ఆ తర్వాత షూటింగ్ లొకేషన్స్ లో దిగిన ఫోటోలని ఇనయా తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో రంగస్థలం ఫేమ్ మహేశ్, సుమన్ శెట్టి, తదితరులు ఉన్నారు. ఈ మూవీ ఓటిటిలో కాకుండా థియేటర్ లో రిలీజ్ అవుతుందని కాన్ఫిడెంట్ గా చెప్పింది. ఇనయా హీరోయిన్ గా చేసిన ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి మరి.