English | Telugu
మహేష్‌కీ, హనుమంతుడికీ సంబంధమే లేదట!
Updated : Apr 15, 2023
ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమాలో మహేష్ పాత్ర ఎలా ఉంటుందో తెలుసా? మహేష్ పాత్రకి హనుమంతుడి లక్షణాలు ఉంటాయట అంటూ ఈ మధ్య న్యూస్ తెగ వైరల్ అయింది. అబ్బెబ్బే... అసలు అలాంటివేమీ లేవు అని కొట్టిపారేశారు రైటర్ విజయేంద్రప్రసాద్. క్రేజీ ప్రాజెక్టుల గురించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది. ఏదో ఒకటి జనాలు మాట్లాడుకుంటూనే ఉంటారు. ఆ క్రమంలోనే రీసెంట్‌గా వైల్డ్ ఫైర్‌లాగా స్ప్రెడ్ అయింది మహేష్ మూవీ న్యూస్. అసలు మహేష్ మూవీలో పౌరాణిక పాత్రల ప్రస్తావనే లేదని సూటిగా చెప్పేశారు. లార్డ్ హనుమాన్ పాత్రగానీ, మరే పౌరాణికి పాత్రగానీ మాకు ఇన్‌స్పిరేషన్ కాదు. అసలు మహేష్ కేరక్టర్‌కి అలాంటి లక్షణాలను మేం తీసుకోనే లేదు అని అన్నారు. మహేష్‌బాబు జంగిల్ అడ్వెంచరర్‌గా కనిపిస్తారు. అడవులకు ప్రాధాన్యం ఉన్న సబ్జెక్ట్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా బోలెడన్ని లొకేషన్లలో షూటింగ్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా శ్రీలంకలో మేజర్ షెడ్యూల్ ప్లాన్ చేసే అవకాశం ఉంది.
ఈ చిత్రంలో మహేష్ పక్కన జాన్వీ నటిస్తారన్నది మరో వార్త. ఈ మధ్యనే తారక్ సినిమాకు సైన్ చేసిన జాన్వీ, త్వరలోనే మహేష్ తో స్టెప్పులేస్తారని అనుకున్నారు. అయితే ఇందులోనూ నిజం లేదన్న మరో వార్త స్ప్రెడ్ అవుతోంది. ఇప్పటిదాకా జాన్వీ సైన్ చేసింది జస్ట్ ఒక సినిమాకే. అది కూడా తారక్ సినిమాకి. ఇంకో తెలుగు సినిమాకి ఆమె సైన్ చేయలేదన్నది బోనీ కాంపౌండ్‌లో ఉన్న మాట. సో రాజమౌళి - మహేష్ మూవీకి సంబంధించి ప్రచారంలో ఉన్న లార్డ్ హనుమాన్ విషయం, జాన్వీ విషయం కూడా నిజం కాదన్నమాట.