Read more!

English | Telugu

రజనీ కాంత్ రాణా మూవీలో ఇలియానా

సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా, కె.యస్.దర్శకత్వంలో నిర్మించే భారీ బడ్జెట్ చిత్రంలో నలక నడుము గోవా భామ ఇలియానా ఒక హీరోయిన్ గా నటిస్తుందని తెలిసింది. వివరాల్లోకి వెళితే సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా మూడు పాత్రల్లో నటిస్తూండగా, కె.యస్.దర్శకత్వంలో నిర్మించే భారీ బడ్జెట్ చిత్రంలో, రజనీ కాంత్ సరసన మొత్తం నలుగురు హీరోయిన్లు అవసరమయ్యారట. వారిలో ఇప్పటికే విద్యాబాలన్ ఒక హీరోయిన్ గా ఎన్నిక కాగా, మరో హీరోయిన్ గా ఇలియానా ఎన్నికయ్యిందట.మరో హీరోయిన్ గా ప్రముఖ బాలీవుడ్ నటి రేఖను కోరగా, అందుకామె రెండు కోట్ల రూపాయలను పారితోషికంగా అడిగిందట.

 

ఆమె స్థానంలో మరో ప్రముఖ బాలీవుడ్ నటి , డ్రీమ్ గర్ల్ హేమా మాలినితో మాట్లాడుతున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా అందిన సమాచారం. ఇంకొక హీరోయిన్ గా వేరెవరిని తీసుకుంటారో ఇంకా తెలియలేదు. సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరోగా, కె.యస్.రవి కుమార్ దర్శకత్వంలో నిర్మించే భారీ బడ్జెట్ చిత్రం అతి త్వరలో సెట్స్ పైకి వెళ్ళ నుంది. ఈ చిత్రమ వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారట.