English | Telugu

పవన్ కళ్యాణ్ హీరోగా నీలకంఠ మూవీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, విలక్షణ విభిన్న దర్శకుడు నీలకంఠ ఒక మూవీ చేయబోతున్నారట. వివరాల్లోకి వెళితే నీలకంఠ తను తొలిసారిగా దర్శకత్వం వహించిన "షో" చిత్రంతోనే జాతీయ స్థాయిలో అవార్డ్ పొందిన దర్శకుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కా కమర్షియల్ హీరో. మరి వీళ్ళిద్దరికీ పొత్తెలా కుదురుతుంది...? అంటే నీలకంఠ మిస్సమ్మ, నందననం 120 కి.మీ, సదా మీ సేవలో, మిస్టర్ మేధావి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం శ్రీకాంత్ హీరోగా నటిస్తున్న "విరోధి" అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ "విరోధి" నక్సలిజం నేపథ్యంలో సాగే విభిన్నమైన కథతో నిర్మించబడుతున్న చిత్రం.

ఇదిలా ఉంటే దర్శకుడు నీలకంఠ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఒక కథ చెప్పారట. ఆ కథ ఆయనకి చాలా బాగా నచ్చిందనీ, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతూందనీ సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం "తీన్‍ మార్" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత "ది షాడో" చిత్రలోనూ, ఆ తర్వాత "గబ్బర్ సింగ్" చిత్రంలోనూ నటించిన అనంతరం నీలకంఠ దర్శకత్వంలో నటిస్తారని సమాచారం. నీలకంఠ వంటి ఒక ఆర్ట్ ఫిలింస్ తీసే దర్శకుడు, పవన్ కళ్యాణ్ వంటి ఒక కమర్షియల్ హీరో కలసి చేసే ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులకు ఆసక్తి కలిగిస్తుందనటంలో సందేహం లేదు.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.