English | Telugu

ఆయనకు తలబిరుసేమోనని అనుకున్న ప్రిన్స్

కృష్ణమాధవ్, అనూష, సంస్కృతి కలిసి నటించిన చిత్రం "హృదయం ఎక్కడున్నది". ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు మహేష్ బాబు ముఖ్య అతిదిగా విచ్చేసారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ.. "కృష్ణమాధవ్ నాకు ఖలేజా సినిమా చేస్తున్నప్పటి నుంచి బాగా తెలుసు. పెద్దింటి నుంచి వచ్చాడు కదా. తలబిరుసు ఉంటుందేమో అని అనుకున్నా. కానీ తనలో కష్టపడే తత్వం నాకు బాగా నచ్చింది. అతను తొలిసారి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం విజయవంతం కావాలి అని అన్నారు. ఈ కార్యక్రమానికి గల్లా అరుణ కుమారి కుటుంబ సభ్యులు కూడా విచ్చేసారు. గల్లా అరుణ కుమారి మాట్లాడుతూ... "మా మేనల్లుడు మాధవ్ సినిమాల్లోకి రావడం ఆశ్చర్యంగా ఉంది. హాయిగా అమెరికాలో ఉద్యోగం చేసుకో అని చెప్పిన వినలేదు. ఇన్నాళ్ళకు తన కోరికను ఈ సినిమాతో నెరవేర్చుకున్నాడు అని అన్నారు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.