English | Telugu

బ్రహ్మికి సింహం వార్నింగ్...!

"సింహ" తర్వాత బాలకృష్ణ నటించిన ఏ ఒక్క సినిమా విజయం సాధించకపోగా అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. దాంతో ప్రస్తుతం నటిస్తున్న "లెజెండ్" పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. షూటింగ్ సమయానికి ఎవరైనా లేటుగా వస్తే వారిని తన స్టైల్ లో తాట తీస్తున్నాడట. ఇటీవలే బ్రహ్మానందం కూడా ఇలాగే షూటింగ్ కు ఆలస్యంగా వస్తే.. బ్రహ్మికి కూడా బాలయ్య అందరి ముందే గట్టిగా వార్నింగ్ ఇచ్చాడంట. అదే విధంగా సినిమా గురించి ఎలాంటి విషయాలు లీక్ చేసిన కూడా సహించేది లేదని చిత్ర యూనిట్ అందరికి బాలయ్య వార్నింగ్ ఇచ్చాడని తెలిసింది. మరి అసలే వరుస ఫ్లాపులతో ఉన్న బాలయ్య, "దమ్ము" వంటి ఫ్లాప్ చిత్రం తర్వాత బోయపాటిలు ఇద్దరు కలిసి ఈ సినిమాను ఎలాగైనా విజయవంత చిత్రంగా అందించాలని పట్టుదలతో ఉన్నట్లుగానే అనిపిస్తుంది. చూద్దాం. మరి ఈ చిత్రం వీరిద్దరికీ ఎలాంటి విజయాన్ని అందిస్తుందో.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.