English | Telugu

‘గేమ్‌ ఛేంజర్‌’ విషయంలో హైకోర్టు సీరియస్‌..!

సంధ్య థియేటర్‌ తొక్కిసలాట ఘటన రెండు తెలుగు రాష్ట్రాలోనే కాదు, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీని గురించి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఇకపై స్టార్‌ హీరోల సినిమాలకు సంబంధించి బెనిఫిట్‌ షోలకుగానీ, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి గానీ అనుమతులు ఇవ్వబోమని అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన ఈ ప్రకటనతో సంక్రాంతి సినిమాలు అయోమయంలో పడ్డాయి. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కిన ‘గేమ్‌ ఛేంజర్‌’పై రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉందని అందరూ భావించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం బెనిఫిట్‌ షోలు, టికెట్‌ రేట్ల పెంపు విషయంలో సానుకూలంగా స్పందించి అనుమతులు ఇచ్చింది.

ఇదే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా అసెంబ్లీలో చేసిన ప్రకటనను పక్కన పెట్టి ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రానికి బెనిఫిట్‌ షోలకు, టికెట్‌ రేట్లు పెంచుకునే వీలు కల్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది టికెట్‌ ధరలు, ప్రత్యేక ప్రదర్శనలపై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. ఓ పక్క ఇకపై పెద్ద హీరోల సినిమాలకు ప్రత్యేకమైన అనుమతులు రద్దు చేశామని చెబుతూనే స్పెషల్‌ షోలకు అనుమతి ఇవ్వడం ఏమిటని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అర్థరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత, తెల్లవారుజామున షోలకు అనుమతి ఇవ్వడంపై పున: సమీక్ష చెయ్యాలని హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.