English | Telugu

బాలయ్యకు లైన్ క్లియర్.. సంక్రాంతి విన్నర్ డాకు మహారాజేనా..?

ఈ సంక్రాంతికి 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తలపడుతున్నాయి. అయితే వీటిలో 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్' సినిమాల మధ్యనే ప్రధాన పోటీ అని చెప్పవచ్చు. ఎందుకంటే మెగా-నందమూరి బాక్సాఫీస్ వార్ కి ఎప్పుడూ ఫుల్ క్రేజ్ ఉంటుంది. పైగా సంక్రాంతి సీజన్ కావడంతో ఈ రెండు సినిమాల పోరుపై ప్రేక్షకుల దృష్టి మరింత పడింది. 'గేమ్ ఛేంజర్', 'డాకు మహారాజ్' లలో ఏ సినిమా సంక్రాంతి విజేతగా నిలుస్తుందనే ఆసక్తి నెలకొంది. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. 'డాకు మహారాజ్' చిత్రమే పైచేయి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. (Game Changer)

'గేమ్ ఛేంజర్' తాజాగా ప్రేక్షకుల ముందుకు రాగా, 'డాకు మహారాజ్' జనవరి 12న థియేటర్లలో అడుగుపెట్టనుంది. అయితే 'గేమ్ ఛేంజర్'పై విడుదలకు ముందు నుంచే నెగటివ్ వైబ్స్ కనిపించాయి. దాదాపు నాలుగేళ్ల క్రితం ఈ చిత్రాన్ని ప్రకటించారు. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో ఫస్ట్ మూవీ కావడంతో.. మొదట్లో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి బాగానే ఉంది. కానీ ఇండియన్-2 కారణంగా 'గేమ్ ఛేంజర్' షూటింగ్ బాగా ఆలస్యమవ్వడంతో.. ఆ ఆసక్తి సన్నగిల్లుతూ వచ్చింది. ఇక ట్రైలర్ విడుదల తర్వాత.. ఇది ఒకప్పటి శంకర్ మార్క్ సినిమా కాదని, ఒక రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్ అనే క్లారిటీకి అందరూ వచ్చేశారు. అందుకు తగ్గట్టుగానే తాజాగా విడుదలైన ఈ చిత్రం, మొదటి షో నుంచే డివైడ్ టాక్ ని తెచ్చుకుంది. భారీతనం, చరణ్ నటన తప్ప సినిమాలో చెప్పుకోడానికి ఏం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు అందరి దృష్టి 'డాకు మహారాజ్'పై పడింది. (Daaku Maharaaj)

'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో 'డాకు మహారాజ్'పై మొదటి నుంచి ప్రేక్షకుల్లో భారీ అంచనాలన్నాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. ముఖ్యంగా ట్రైలర్ లో విజువల్స్ మెస్మరైజ్ చేశాయి. ఇప్పుడు 'గేమ్ ఛేంజర్'కి నెగటివ్ టాక్ రావడంతో, 'డాకు మహారాజ్'కి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు రాబట్టే అవకాశముంది. అదే జరిగితే 'డాకు మహారాజ్' సంక్రాంతి విన్నర్ గా నిలుస్తుంది.

అల్లు శిరీష్ పెళ్లి డేట్ ఇదే.. దక్షిణాది వాళ్ళం అలాంటివి చేసుకోము కదా  

ఐకాన్ స్టార్ 'అల్లు అర్జున్'(Allu Arjun)సోదరుడు అల్లు శిరీష్(Allu Sirish)గురించి తెలుగు సినిమా ప్రేక్షకులకి తెలిసిందే. వెంట వెంటనే సినిమాలు చేయకపోయినా అడపా దడపా తన రేంజ్ కి తగ్గ సినిమాల్లో కనిపిస్తు మెప్పిస్తు వస్తున్నాడు. ప్రస్తుతం ఎలాంటి కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేయకపోయినా ప్రీవియస్ చిత్రం 'బడ్డీ'తో పర్వాలేదనే స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు. శిరీష్ కి అక్టోబర్ 31 న నయనిక రెడ్డి తో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆ సమయంలో పెళ్లి డేట్ ని అనౌన్స్ చెయ్యలేదు. ఇప్పుడు ఆ డేట్ పై అధికార ప్రకటన వచ్చింది.

50 కోట్లు వదులుకున్నాడు.. వరుణ్ తేజ్ గని గుర్తింది కదా 

ప్రస్తుతం ఉన్న రేంజ్ ని బట్టి హీరో స్థాయి వ్యక్తికి  ఒక సినిమా మొత్తం చేస్తే ఎంత డబ్బు వస్తుందో, అంతే డబ్బు కేవలం రెండు, మూడు నిమిషాల యాడ్ తో వస్తే ఏ హీరో అయినా వదులుకుంటాడా అంటే వదులుకునే ఛాన్స్ లేదని భావించవచ్చు. ఎందుకంటే క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు డబ్బులు వెనకేసుకోవాలనే సామెత ని అవపోసన బట్టి ఉంటాడు. కాబట్టి చేసే అవకాశాలే ఎక్కువ. హీరో సునీల్ శెట్టి కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది. రెండు నిముషాలు కనపడి ఒక మాట చెప్తే 40 కోట్ల రూపాయలు ఇస్తామని అన్నారు. కానీ సునీల్ శెట్టి తిరస్కరించాడు. ఈ విషయం గురించి ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.