English | Telugu
"సమయమా".. వాట్ ఎ మెలోడీ 'నాన్న'.. ఇది సరిపోదా.. !!
Updated : Sep 16, 2023
నేచురల్ స్టార్ నాని నాన్నగా సందడి చేయబోతున్న సినిమా 'హాయ్ నాన్న'. నూతన దర్శకుడు శౌర్యవ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో 'సీతారామం' ఫేమ్ మృణాళ్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా.. క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 21న తెరపైకి రాబోతోంది.
ఇదిలా ఉంటే, 'హాయ్ నాన్న' నుంచి ఈ రోజు (శనివారం) ఫస్ట్ సింగిల్ వచ్చింది. 'ఖుషి' ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహబ్ స్వరకల్పనలో రూపొందిన ఈ గీతం.. "సమయమా" అంటూ మొదలవుతుంది. హేషమ్ వినసొంపైన బాణీకి అనంత శ్రీరామ్ అర్థవంతమైన సాహిత్యం తోడైంది. అలాగే అనురాగ్ కులకర్ణి, సితార కృష్ణకుమార్ గాత్రం కూడా ఆకర్షణగా నిలిచింది. నాని, మృణాళ్ పై చిత్రీకరించిన ఈ పాటలో విజువల్స్ కూడా కంటికింపుగా ఉన్నాయి. ఓవరాల్ గా.. "వాట్ ఎ మెలోడీ" అనుకునేలా "సమయమా" ఉంది. మరి.. ఫస్ట్ సింగిల్ తో ఇంప్రెస్ చేసిన 'హాయ్ నాన్న' యూనిట్.. రాబోయే గీతాలతోనూ అదే మ్యాజిక్ కొనసాగిస్తుందేమో చూడాలి.