English | Telugu
సూపర్‌స్టార్‌తో లోకేష్ సినిమా... స్టోరీ ఫిక్స్!
Updated : Aug 23, 2023
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది.ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ యూనివర్శ్‌తో సంబంధం ఉండేలా కథ రాసుకున్నారట డైరక్టర్ అంటూ ఈ మధ్య వార్తలొచ్చాయి. అయితే అందులో నిజం లేదని అంటోంది డైరక్టర్ కాంపౌండ్. ఇప్పటిదాకా ఈ సినిమా గురించి రజనీకాంత్ ఎక్కడా నోరు విప్పలేదు. అసలు లోకేష్ మాట్లాడనే లేదు. ప్రొడక్షన్ హౌస్ కన్‌ఫర్మ్ కూడా చేయలేదు. కానీ బజ్ మాత్రం మామూలుగా లేదు. కోలీవుడ్ రిపోర్ట్స్ ప్రకారం... రజనీ - లోకేష్ ప్రాజెక్ట్ ని స్టాండ్ అలోన్ వెంచర్ అని అంటున్నారు. లోకేష్ కనగరాజ్ యూనివర్శ్ తో జీరో కనెక్షన్ అని చెబుతున్నారు. ఈ సినిమాకు టెంటేటివ్‌గా తలైవర్ 171 అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. ఈ ఏడాది ఆఖరులో షూటింగ్ మొదలవుతుంది. ఒకవేళ మిస్ అయితే నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్‌లో ఉంటుంది.
మానగరంతో తన జర్నీని మొదలుపెట్టారు లోకేష్ కనగరాజ్. అయితే ఆ సినిమాలో ఎక్కడా తన యూనివర్శ్‌ని ఎస్టాబ్లిష్ చేయలేదు. ఖైదీతో తన యూనివర్శ్‌ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. ఖైదీ తర్వాత చేసిన మాస్టర్‌లోనూ తన మార్క్ ఉండేలా జాగ్రత్త పడ్డారు. 50 శాతం ఆ సినిమా విజయ్‌ది అయితే, మిగిలిన 50 శాతం లోకేష్‌ది అనే ఫీల్ క్రియేట్‌చేశారు. ఇప్పుడు కూడా విజయ్‌తోనే లియో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇది కూడా లోకేష్ యూనివర్శ్‌లోనే ఉంటుందనే టాక్ ఉంది. ఈ చిత్రంలో రోలెక్స్ కేరక్టర్ కనిపిస్తుందనే ప్రచారం కూడా గట్టిగా సాగింది. నెక్స్ట్ రోలెక్స్ సినిమా లైన్‌లో ఉంది. ఇందులో సూర్య హీరోగా నటిస్తారు. ఖైదీ సినిమాలోని ఢిల్లీ కేరక్టర్ కూడా రోలెక్స్ మూవీలో ఉంటుందట. ఏదేమైనా ఈ యూనివర్శ్‌కి దూరంగా తలైవర్ ప్రాజెక్ట్ సెట్ అవుతోంది.