English | Telugu

అఖిల్ కి హీరోయిన్ దొరికింది

అక్కినేని అఖిల్ తొలి చిత్రానికి హీరోయిన్ దొరికింది. మోడల్ అమైరా దస్తూరను అఖిల్ పక్కన హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం.గతేడాది బాలీవుడ్‌లో వచ్చిన ‘ఇష్క్’ మూవీ ద్వారా ఈ అమ్మడు వెండితెరపై అడుగుపెట్టింది. ఇదిలావుండగా ధనుష్ హీరోగా కె.వి. ఆనంద్ డైరెక్ట్ చేస్తున్న ‘అనెగన్’లో నటించింది. దాంతో ఈ అమ్మడు తెలుగు ప్రముఖుల దృష్టికి వచ్చింది.గతంలో వోడాఫోన్, మైక్రోమాక్స్ యాడ్స్‌లో నటించిన అమేరా..ఇప్పుడు టాలీవుడ్ కి అఖిల్ సినిమా ద్వార పరిచయంకానుంది. తొలుత ఈ ప్రాజెక్ట్‌లో అలియాభట్‌ని తీసుకోవాలని డైరెక్టర్ భావించాడు. కాకపోతే కాల్షీట్లు లేవని ఆమె చెప్పడంతో, అమైరా ను తీసుకున్నారు. హీరోయిన్ ఎంపిక కూడా పూర్తవటంతో త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి, వేసవిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తారట.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.