English | Telugu

ముకుందలో స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌ లేదు

వెండి తెర‌పై వ‌రుణ్ తేజ్ రూపంలో మ‌రో మెగా హీరో రాబోతున్నాడు. ఈ నెల 24న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. మెగా హీరో సినిమా, అందులోనూ శ్రీ‌కాంత్ అడ్డాల డైరెక్ష‌న్‌, దానికి తోడు ఠాగూర్ మ‌ధు తీస్తున్న సినిమా... వీట‌న్నింటి మ‌ధ్య రిలీజ్ అవుతున్న ముకుందపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ కూడా ఓ కేమియో రోల్ చేస్తున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను వరుణ్ తేజ కొట్టిపారేశారు. ఈ సినిమాలో ఇతర ఏ మెగా హీరో అతిధి పాత్ర చేయలేదని స్పష్టం చేశారు. ముకుంద రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు కాస్త భిన్నంగా వుంటుందని తెలిపారు. ఈ సినిమా ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

సినిమాకి ఉన్న శక్తిని మరోసారి చాటి చెప్పావు.. వాళ్ళు భయపడుతున్నారంట! 

కళ.. పేరుగా చూసుకుంటే నామ్ చోటా.. కానీ పంచ భూతాలకి ఎంత శక్తీ ఉందో 'కళ' కి అంతే శక్తీ ఉంది. ఈ కళ నుంచి సినిమా(cinema)రూపంలో వచ్చే మాట, పాట, నటన, నటుడు, దృశ్యం అనేవి మనిషి నరనరనరాల్లో చాలా భద్రంగా ఉండిపోతాయి. ఆ ఐదింటి ద్వారా తమకి బాగా దగ్గరయ్యే  నటుడ్ని అయితే సూపర్ హీరోగా  చేసి తమ గుండెల్లో దైవశక్తిగా భద్రంగా కొలుచుకుంటూ ఉంటారు. ఇళయ దళపతి విజయ్ అప్ కమింగ్ మూవీ జననాయగన్(Jana Nayagan)రేపు ప్రీమియర్స్ నుంచే అడుగుపెడుతుండటంతో సినిమా గొప్ప తనం గురించి మరో సారి సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చల వెనక ఉన్న పూర్తి విషయం ఏంటో చూద్దాం.