English | Telugu

6 నెలల తర్వాత మాట్లాడతా..పవన్ పాలిటిక్స్ పై  విష్ణు మంచు కామెంట్స్

మెగా ఫ్యామిలీ, మంచు కుటుంబాల మధ్య ఎప్పుడూ టామ్ అండ్ జెర్రీ వార్ నడుస్తూనే ఉంటుంది. ఒక్కోసారి అది పరిధులను కూడా దాటేస్తుంటుంది. అలాంటి సందర్భాల్లో మీడియాకు కావాల్సినం ఫీడ్ దొరికేసినట్లే అవుతుంది. మరీ ముఖ్యంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో రెండు కుటుంబాల మధ్య నువ్వా నేనా? అనేలా మాటల యుద్ధం కూడా నడిచిన సంగతి బహిర్గత విషయమే. ఆ ఎన్నికల్లో మంచు ఫ్యామిలీదే పైచేయి అయ్యింది. తర్వాత ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. మంచు ఫ్యామిలీ విషయానికి వస్తే మోహన్ బాబు, విష్ణు కంటే మంచు మనోజ్, లక్ష్మీ ప్రసన్నమెగా ఫ్యామిలీకి దగ్గరవుతున్నారు. రీసెంట్ గా జరిగిన కొన్ని పరిణామాలను చూస్తే ఆ విషయాన్ని అవుననక చెప్పదు.

త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు రాబోతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాలను చేస్తూనే వారాహి యాత్ర అంటూ బిజీగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ ను ఉద్దేశించి ఓ సందర్భంలో విష్ణు మంచు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ''పవన్ కళ్యాణ్ తెలుగు సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ క్రౌడ్ పుల్లర్. ఆయన ఓ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ నెక్ట్స్ సినిమా హిట్ అయితే అంతకు మూడు రెట్లు కలెక్షన్ వస్తాయి. ఆయితే ఆయన పొలిటికల్ కెరీర్ గురించి మాట్లాడాలంటే మాత్రం 6 నెలల తర్వాత మాట్లాడుతాను" అన్నారు.

అంటే ఆరు నెలల్లో ఏపీలో ఎన్నికలు జరుగుతాయి. ఫలితాలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. దాని ప్రకారమే తాను మాట్లాడుతాననేది విష్ణు మంచు క్లారిటీగా చెప్పేశారు. మరో వైపు మోహన్ బాబు తాను ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్నానంటూ మోహన్ బాబు చెప్పిన సంగతి తెలిసిందే. మరి త్వరలోనే ఏపీ ఎలక్షన్ రానున్నాయి. ఆ సమయంలో మంచు ఫ్యామిలీ ఎటు వైపు మొగ్గు చూపుతుందో చూడాలి.

పాన్ ఇండియా మూవీ నీలకంఠ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్.. జనవరి 2న గ్రాండ్ రిలీజ్ 

పలు తెలుగు, తమిళ సూపర్ హిట్ చిత్రాల్లో బాలనటుడిగా నటించిన మాస్టర్ మహేంద్రన్(Master Mahendran)ఇప్పుడు సోలో హీరోగా మారి చేస్తున్న చిత్రం. 'నీలకంఠ'(Nilakanta)శ్రీమతి ఎం.మమత, శ్రీమతి ఎం. రాజరాజేశ్వరి సమర్పణలో ఎల్ఎస్ ప్రొడక్షన్స్, గ్లోబల్ సినిమాస్ బ్యానర్స్ పై మర్లపల్లి శ్రీనివాసులు, వేణుగోపాల్ దీవి నిర్మిస్తున్నారు. రాకేష్ మాధవన్ దర్శకుడు కాగా, నేహా పఠాన్, యష్న ముతులూరి, స్నేహా ఉల్లాల్ హీరోయిన్స్ గా చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో జనవరి 2న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కి  రెడీ అవుతోంది. ఈ రోజు ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ని మేకర్స్  హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు.