English | Telugu
విజయ్ ‘లియో’కి కోర్టు నోటీసులు... కారణం ఏమిటంటే!
Updated : Oct 10, 2023
దళపతి విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘లియో’. దసరా సందర్భంగా ఈ సినిమాను అక్టోబర్ 19న విడుదల చేయటానికి మేకర్స్ ప్లాన్ చేశారు. తెలుగులో ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మాస్ ఇమేజ్ ఉన్న విజయ్ ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాలు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. తొలిరోజున విజయ్ కలెక్షన్స్ పరంగా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తారోనని వెయిట్ చేస్తున్నారు. ఈ సమయంలో ‘లియో’ మూవీకి కోర్టు నోటీసులు రావటం అనేది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. అసలు ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు ముగిసిన తర్వాత కోర్టు నోటీసులు రావటం ఏంటటి? దానికి కారణమెవరు? అనే వివరాల్లోకి వెళితే,
‘లియో’ మూవీ థియేట్రికల్ ట్రైలర్‌ను రీసెంట్‌గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆయన అభిమానులు ఈ ట్రైలర్‌ను చూడటానికి పెద్ద సంఖ్యలో థియేటర్స్‌ను బుక్ చేసి ప్రదర్శించారు. కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించి థియేటర్స్‌ను ధ్వంసం కూడా చేశారు. అయితే అభిమానులు అల్లరి చేసిన దానికేమైనా కోర్టు నోటీసులు పంపిందా? అనుకుంటే పొరపాటే. అసలు విషయమేమంటే.. ‘లియో’ సినిమా సెన్సార్ కాకముందు ట్రైలర్‌ను మేకర్స్ ప్రదర్శించారు. అందులో కొన్ని అభ్యంతరకరమైన పదాలుండటం అనేది ఇప్పుడు సమస్యగా మారింది. దీనిపై సెన్సార్ బోర్డు సినిమా నిర్మాతలకు లీగల్ నోటీసులు పంపింది. మరి దీనిపై మేకర్స్ ఎలా స్పందింస్తారో చూడాలి మరి.
మాస్టర్ చిత్రం తర్వాత విజయ్, లోకేష్ కనకరాజ్ కలయికలో ‘లియో’ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించింది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‌తో పాటు అర్జున్ సర్జా ఇందులో కీలక పాత్రల్లో నటించారు. అనిరుద్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు.