English | Telugu
అన్నబర్త్ డే తమ్ముడు ట్రైలర్
Updated : Jun 15, 2015
అన్నదమ్ములకు అస్సలు నప్పడం లేదని...భవిష్యత్ లో కలిసేది లేదని తెగ హడావుడి చేశారు. వీటన్నింటికీ గబ్బర్ సింగ్ 2తో పవన్ చెక్ పెట్టేస్తున్నాడు. ఏంటీ కొంపతీసి చిరు ఏమైనా గబ్బర్ సింగ్ 2లో నటిస్తున్నాడా అంటారా? అంతసీన్ లేదుకానీ పవన్ తన లేటెస్ట్ మూవీ గబ్బర్ సింగ్ 2 ట్రైలర్ ను చిరు బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడట.
సాధారణంగా మహేశ్ బాబు తండ్రి పుట్టినరోజున తన సినిమా ట్రైలర్ విడుదల చేస్తుంటాడు. సో పవన్....మహేశ్ ను ఫాలో అవుతున్నాడా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎవరేమనుకున్నా అదే రోజు చిరు షష్టిపూర్తి కూడా కావడంతో అన్నపట్ల తనకున్న గౌరవ సూచకంగా ఈ నిర్ణయం తీసుకున్నాడని టాక్. మరో వైపు గ్యాప్ లేదన్నందుకు సంకేతం కూడా అంటున్నాడు. ఏదిఏమైనా చిరు బర్త్ డే-షష్టిపూర్తి-గబ్బర్ సింగ్ 2 ట్రైలర్....ఒకే రోజైతే మెగా ఫ్యాన్స్ కు పండుగే పండుగ.