English | Telugu

ప్ర‌భాస్‌ని.. బాహుబ‌లి వ‌ద‌లట్లేదు!

దాదాపు రెండున్న‌ర సంవ‌త్స‌రాలు బాహుబ‌లితోనే గ‌డిపేశాడు ప్ర‌భాస్. ఇప్పుడు ఆ సినిమా ముందుకొస్తోంది. బాహుబ‌లి వ‌ల్ల‌ రెండేళ్ల పాటు మ‌రే సినిమానీ ఒప్పుకోలేక‌పోయాడు. క‌నీసం క‌థ‌లు కూడా విన‌లేదు. చివ‌రాఖ‌రికి సుజీత్ (ర‌న్ రాజా ర‌న్ ఫేమ్‌) క‌థ‌కి ఓకే చెప్పాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు మొద‌ల‌వుతుందా అనే సందేహాలు నెల‌కొన్నాయి. మేలో ఈ సినిమా ప‌ట్టాలెక్కాల్సింది. కానీ బాహుబ‌లి పూర్తికాక‌పోవ‌డంతో ఆగిపోయింది.

ఇప్పుడు పార్ట్ 1 పూర్త‌యి, విడుద‌ల‌కు సిద్ధ‌మైంది. అయినా.. సుజిత్ సినిమా మొద‌ల‌వ్వ‌లేదు. బాహుబ‌లి జులై 10న విడుద‌ల కానుంది. ఆ త‌ర‌వాతే.. సుజిత్ సినిమా కొబ్బ‌రికాయ్ కొట్టుకొంటుంద‌నుకొన్నారు. ఇప్పుడు ఆ అవ‌కాశం కూడా లేకుండా పోయింది. ఎందుకంటే.. బాహుబ‌లి పార్ట్ 2లో ఇంకా 30 శాతం షూటింగ్ మిగిలి ఉంది. ''పార్ట్ 2 షూటింగ్ పూర్తిచేశాకే... కొత్త సినిమా ఒప్పుకో....'' అని ప్ర‌భాస్ ని రాజ‌మౌళి బ‌ల‌వంతం చేస్తున్నాడ‌ట‌. అయితే ప్ర‌భాస్ మాత్రం.. 'బాహుబ‌లి 1 రిజ‌ల్ట్ బ‌ట్టి ఆలోచిద్దాం' అంటున్నాడట‌.


ఒక‌వేళ బాహుబ‌లి ఊహించిన రీతిలోనే రికార్డులు బ‌ద్ద‌లుకొట్టే చిత్ర‌మైతే, అదే ఊపులో 2 కూడా పూర్తి చేద్దామ‌నుకొంటున్నాడు ప్ర‌భాస్‌. అనుకొన్న అంచ‌నాల్ని అందుకోక‌పోతే మాత్రం.. బాహుబ‌లి 2కి కొంత బ్రేక్ ఇచ్చి ఈలోగా ఓ సినిమా పూర్తిచేద్దామ‌ని భావిస్తున్నాడు. ప్ర‌భాస్‌కొత్త సినిమా ఎప్పుడు అనేది ... బాహుబ‌లి 1 రిజ‌ల్టే నిర్ణ‌యించాలి.

టబు కూతురు ఎవరో తెలిసింది.. మరి టబుకి పెళ్లి కాలేదు కదా

టబు(Tabu)..ఈ పేరు చెబితే  తెలియని తెలుగు ప్రేక్షకుడు లేడు. ఆ మాటకొస్తే టబు అంటే తెలియని భారతీయ సినీ ప్రేక్షకుడు కూడా ఉండడు. ఏ క్యారక్టర్ పోషించినా సదరు క్యారక్టర్ ని అభిమానులు, ప్రేక్షకుల దృష్టిలో బ్రాండ్ అంబాసిడర్ గా మార్చడం టబుకి ఉన్న స్పెషాలిటీ. కింగ్ నాగార్జున(Nagarujuna)తో చేసిన 'నిన్నే పెళ్లాడతా'లోని మహాలక్ష్మి క్యారక్టర్ నే ఒక ఉదాహరణ. అంతలా తనదైన ఛరిష్మాతో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని ముద్ర వేసింది. ప్రస్తుతం టబు వయసు 54 . ఈ ఏజ్ లోను యంగ్ హీరోయిన్స్ కి పోటీ ఇస్తూ వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు దూసుకుపోతుంది.

జనవరి 4 నుంచే మన శంకర వరప్రసాద్ హంగామా.. వెల్లడి చేసిన మేకర్స్ 

సిల్వర్ స్క్రీన్ పై అడుగుపెడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu)ద్వారా మెగా ప్రవాహాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా అనే ఆశతో అభిమానులతో పాటు మూవీ లవర్స్, ప్రేక్షకులు ఉన్నారు. పైగా ఈ సారి  మెగాస్టార్ కి విక్టరీ కి యాడ్ కావడంతో వాళ్ల ఆశల రేంజ్ ని దేనితోను కంపార్ చేయలేని పరిస్థితి. . దీంతో ఎగ్జైట్మెంట్ ని  ఆపుకొని ఉండటం ఇద్దరి అభిమానులకి  కొంచం కష్టంగా ఉన్నా రాబోయే మెగా విక్టరీ హుంగామా ని ఊహించుకుంటు  జనవరి 12 కోసం రీగర్ గా  వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆనందం ఎనిమిది రోజులు ముందుగానే రాబోతుంది. .