English | Telugu
భారీ అగ్నిప్రమాదం నుంచి బయటపడ్డ బిగ్‌బాస్ బ్యూటీ!
Updated : Nov 7, 2023
బిగ్‌బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న శ్వేతావర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది శ్వేత. ‘ఓ భయంకరమైన అగ్ని ప్రమాదాన్ని మా ఇంట్లోనే చూశాను.. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగింది.. రూమ్ మొత్తం కాలిపోయింది.. నా ఫ్యామిలీ, నా పెట్స్ సేఫ్‌గానే ఉన్నారు. కానీ, ఈ భయంకరమైన ఘటన నుంచి కోలుకునేందుకు కాస్త టైం పట్టేలా ఉంది.. నా కోసం మీరు ప్రార్థించండి. మేం క్షేమంగానే ఉన్నాం.. కొన్ని రోజుల తరువాత మళ్లీ సోషల్ మీడియాలోకి వస్తాను’ అని పోస్ట్ చేసింది.
అంతకుముందు చాలా సినిమాల్లో నటించినప్పటికీ బిగ్‌బాస్ హౌస్‌లోకి వచ్చిన తర్వాతే శ్వేతావర్మ పాపులర్ అయ్యింది. రాణి, పచ్చీస్, మ్యాడ్, ముగ్గురు మొనగాళ్లు, గుడ్ లఖ్ సఖి, ఏకం, కొండవీడు, రోజ్ విల్లా.. ఇలా అనేక సినిమాల్లో కనిపించింది. హీరోయిన్‌గా, సైడ్ ఆర్టిస్ట్‌గా చాలా సినిమాలు చేసింది. అయితే ఆమెకు ఆశించినంత గుర్తింపు రాలేదు. బిగ్‌బాస్ హౌస్‌లోకి శ్వేత వెళ్లిన తర్వాత ఆమెకు ఒక ఇమేజ్ వచ్చింది. శ్వేతా వర్మ, ఆనీ మాస్టర్ల రిలేషన్, గొడవలు అందరికీ కనెక్ట్ అయ్యాయి. తల్లీకూతుళ్లలా ఎంతో దగ్గరయ్యారు. బిగ్‌బాస్‌తో మంచి ఇమేజ్ వచ్చినప్పటికీ సినిమాల్లోగానీ, బుల్లితెరపైగానీ ఆమెకు అవకాశాలు రావడం లేదు. తన ఉనికిని కాపాడుకునేందుకు మాత్రమే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో అందర్నీ పలకరిస్తూ ఉంటుంది. అయితే రెగ్యులర్‌గా టచ్‌లో ఉండకుండా అప్పుడప్పుడు పోస్టులు పెడుతూ ఉంటుంది. శ్వేత పోస్టుకు బిగ్‌బాస్ ప్రియ స్పందించింది. శ్వేత కోసం తానెప్పుడూ ప్రార్థిస్తుంటాను అంటూ కామెంట్ పెట్టింది. నెటిజన్లు కూడా శ్వేతకు ధైర్యం, జాగ్రత్తలు చెబుతున్నారు.