English | Telugu
కమల్‌హాసన్ సినిమాలో దుల్కర్ సల్మాన్?
Updated : Sep 13, 2023
ది లెజెండరీ యాక్టర్ కమల్‌హాసన్ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్ వచ్చేసింది. మణిరత్నం దర్శకత్వంలో కమల్‌హాసన్ ఓ సినిమాలో నటిస్తున్నారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తోంది. 1987లో విడుదలైన కల్ట్ క్లాసిక్ సినిమా నాయకన్, తర్వాత ఈ కాంబోలో సినిమా అనగానే అందరూ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్నారు. టెంటేటివ్‌గా ఈ ప్రాజెక్టుకు కేహెచ్234 అనే టైటిల్ నడుస్తోంది. ఈ సినిమాలో కమల్‌హాసన్‌తో పాటు మరో ఇద్దరు యంగ్ హీరోలు కూడా నటించనున్నారు. దుల్కర్ సల్మాన్, జయం రవికూడా కీ రోల్స్ లో కనిపించనున్నారట. ఫీమేల్ లీడ్‌గా త్రిష పేరు ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది. దుల్కర్ సల్మాన్, జయం రవి కేరక్టర్ల గురించి చిత్ర యూనిట్ మాత్రం ఇప్పటిదాకా నోరు విప్పలేదు. అయితే ఇద్దరూ కథ విన్నారని, సినిమా చేయడానికి తమ సుముఖతను వ్యక్తం చేశారని టాక్. ఇంకా డాటెడ్ లైన్స్ లో సైన్ చేయలేదన్న విషయం కూడా ప్రచారంలో ఉంది.
పొన్నియిన్ సెల్వన్ ఫ్రాంఛైజీ తర్వాత మణిరత్నం దర్శకత్వంలో జయం రవి నటిస్తున్న సినిమా అవుతుంది. అలాగే ఓకే కన్మణి తర్వాత మణిరత్నం దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న సినిమా అవుతుంది. అటు జయం రవిగానీ, ఇటు దుల్కర్ సల్మాన్‌గానీ, ఇప్పటిదాకా కమల్‌హాసన్‌తో కలిసి పనిచేయలేదు. వీరిద్దరూ లోకనాయకుడితో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోయే ఫస్ట్ ప్రాజెక్ట్ ఇదే అవుతుంది. కమల్‌హాసన్‌తో త్రిష ఆల్రెడీ పనిచేశారు. మణిరత్నంతోనూ పనిచేశారు. ఈ సినిమా వారిద్దరితో త్రిషకు హ్యాట్రిక్ సినిమా అవుతుంది. థ్రిల్లర్ జోనర్‌లో ఉంటుందట సబ్జెక్ట్. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. కమల్‌హాసన్, మణిరత్నం ఇద్దరూ కలిసి నిర్మిస్తున్నారు. జి.మహేంద్రన్, శివ అనంత్ కూడా నిర్మాతలే. వినాయకచవితిని పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన మాసివ్ అప్‌డేట్ ఇవ్వడానికి ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.